ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ అన్నదానం..

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ అన్నదానం..

దాతల సేవాభావం… ప్రతిరోజూ అన్నదానానికి విశేష స్పందన

సేవలో ముందున్న తాండూర్ ప్రజలు

తాండూర్ పట్టణంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా జాతరకు తరలివస్తున్న భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. దాతల సహకారంతో ప్రతి రోజూ అన్నదానం ఏర్పాటు చేయడం విశేషంగా నిలుస్తోంది.
ఈ క్రమంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరై, అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించారు. దేవాలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.
ఈ సందర్భంగా దేవాలయ జాతర కమిటీ అధ్యక్షులు మేడి మహేష్ మాట్లాడుతూ,…ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించడం సంతోషకరమని తెలిపారు. జాతర మొత్తం కాలంలో ప్రతిరోజూ అన్నదానం జరుగుతుండటానికి దాతల సహకారం కీలకమని పేర్కొన్నారు. వివిధ సమాజ సంఘాలు కూడా సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ భక్తులకు అల్పాహారం అందిస్తూ, భక్తి కీర్తనలు పాడుతూ జాతర ఉత్సాహాన్ని మరింత పెంచుతున్నాయని తెలిపారు.అలాగే కాంగ్రెస్ నాయకులు, వీరశైవ సమాజం కార్యదర్శి లింగదలీ రవికుమార్ మాట్లాడుతూ,…బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. మంచినీటి సౌకర్యం, అన్నదానం వంటి సేవలను నిరంతరం అందిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమం విజయవంతమైందని అన్నారు. కార్యక్రమాల విజయవంతానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ, సంఘాల ప్రతినిధులకు, సమాజ పెద్దలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ ఈవో శేఖర్ గౌడ్, డైరెక్టర్ శంకర్, బద్రి కే చంద్రశేఖర్, పొగాకు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ అన్నదానం..

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ అన్నదానం..

దాతల సేవాభావం… ప్రతిరోజూ అన్నదానానికి విశేష స్పందన

సేవలో ముందున్న తాండూర్ ప్రజలు

తాండూర్ పట్టణంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా జాతరకు తరలివస్తున్న భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. దాతల సహకారంతో ప్రతి రోజూ అన్నదానం ఏర్పాటు చేయడం విశేషంగా నిలుస్తోంది.
ఈ క్రమంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరై, అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించారు. దేవాలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.
ఈ సందర్భంగా దేవాలయ జాతర కమిటీ అధ్యక్షులు మేడి మహేష్ మాట్లాడుతూ,...ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించడం సంతోషకరమని తెలిపారు. జాతర మొత్తం కాలంలో ప్రతిరోజూ అన్నదానం జరుగుతుండటానికి దాతల సహకారం కీలకమని పేర్కొన్నారు. వివిధ సమాజ సంఘాలు కూడా సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ భక్తులకు అల్పాహారం అందిస్తూ, భక్తి కీర్తనలు పాడుతూ జాతర ఉత్సాహాన్ని మరింత పెంచుతున్నాయని తెలిపారు.అలాగే కాంగ్రెస్ నాయకులు, వీరశైవ సమాజం కార్యదర్శి లింగదలీ రవికుమార్ మాట్లాడుతూ,...బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. మంచినీటి సౌకర్యం, అన్నదానం వంటి సేవలను నిరంతరం అందిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమం విజయవంతమైందని అన్నారు. కార్యక్రమాల విజయవంతానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ, సంఘాల ప్రతినిధులకు, సమాజ పెద్దలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ ఈవో శేఖర్ గౌడ్, డైరెక్టర్ శంకర్, బద్రి కే చంద్రశేఖర్, పొగాకు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

🗓 08 Apr 2026 | 03:46 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top