యాలాల్ మండలంలో టాలెంట్ సెర్చ్ పరీక్షలు విజయవంతం
పరీక్ష రాసిన 600 మంది విద్యార్థులు
50 ప్రభుత్వ, 6 ప్రైవేట్ పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరు
ఉత్తీర్ణులైన విద్యార్థులకు మెడల్స్, ప్రశంస పత్రాల ప్రదానం
విద్యార్థుల్లో పోటీతత్వం పెంపొందించడమే లక్ష్యం
యాలాల ఎంఈఓ మహిపాల్ రెడ్డి
నేటి ఆధునిక పరిజ్ఞానంతో పాటు భవిష్యత్ పరిజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్ననాటి నుంచే విద్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యం కోసమే టాలెంట్ సెర్చ్ పరీక్షలు నిర్వహించడం జరిగిందని యాలాల మండల ఎంఈఓ మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు.
వికారాబాద్ జిల్లా యాలాల్ మండలంలోని అన్ని గ్రామాల్లో గల ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు మండల్ టాలెంట్ సెర్చ్ పరీక్షలు యలల ఎంఈఓ మైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ పరీక్షలకు మండలంలోని 50 ప్రభుత్వ పాఠశాలలు మరియు 6 ప్రైవేట్ పాఠశాలల నుండి సుమారు 600 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందులో 450 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, 150 మంది ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు ఉన్నారు.
ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం నిర్వహించిన ఈ పరీక్షలను రాత పరీక్ష రూపంలో నిర్వహించారు. ఇందులో EVS, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సాధారణ జ్ఞానం (GK) వంటి అంశాలను చేర్చారు.విద్యార్థులను SA-II పరీక్షలకు సిద్ధం చేయడం ప్రధాన ఉద్దేశ్యంగా MRC ఆధ్వర్యంలో అన్ని సబ్జెక్టులపై సుమారు 200 ప్రశ్నలతో మొత్తం 1000 ప్రశ్నల ప్రిపరేషన్ మెటీరియల్‌ను రూపొందించారు. పరీక్షల రాసిన అనంతరం ఉత్తీర్ణులైన
ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు యాలల ఎంఈఓ మహిపాల్ రెడ్డి ద్వారా మెడల్స్ మరియు ప్రశంస పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎంఈఓ. మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ,…ఇలాంటి పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి, వివేచన శక్తి, అవగాహన, సృజనాత్మకత మరియు పోటీతత్వం పెరుగుతాయని తెలిపారు. భవిష్యత్తులో రానున్న పరిజ్ఞానం విద్యార్థులకు పెంపొందించిన వారిమవుతామని అన్నారు.అలాగే గణితంలోని నాలుగు ప్రధాన ప్రక్రియలు — ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ — మరియు సాధారణ జ్ఞానం అంశాల్లో అభ్యాసం మెరుగుపడుతుందని అన్నారు. ఈ పరీక్షలులకు
గత 30 రోజులుగా అంకితభావంతో పనిచేసిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఆర్పీలు అందరినీ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల్లో కనిపించిన ఉత్సాహం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, కృష్ణయ్య, సిద్రామేశ్వర్, శాంతప్ప, సుధాకర్, మల్లమ్మ, రమేష్, ప్రభాకర్, దీపక్, గోవర్ధన్ రెడ్డి, పరమేశ్వర, రవి, శశిధర్, మురారి, బాలకృష్ణ, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే LFH HMలు, ఉపాధ్యాయులు, MRC సిబ్బంది, తల్లిదండ్రులు, అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు మరియు ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయ బృందం కూడా పాల్గొన్నారు.
యాలాల్ మండలంలో టాలెంట్ సెర్చ్ పరీక్షలు విజయవంతం
యాలాల్ మండలంలో టాలెంట్ సెర్చ్ పరీక్షలు విజయవంతం
పరీక్ష రాసిన 600 మంది విద్యార్థులు
50 ప్రభుత్వ, 6 ప్రైవేట్ పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరు
ఉత్తీర్ణులైన విద్యార్థులకు మెడల్స్, ప్రశంస పత్రాల ప్రదానం
విద్యార్థుల్లో పోటీతత్వం పెంపొందించడమే లక్ష్యం
యాలాల ఎంఈఓ మహిపాల్ రెడ్డి
నేటి ఆధునిక పరిజ్ఞానంతో పాటు భవిష్యత్ పరిజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్ననాటి నుంచే విద్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యం కోసమే టాలెంట్ సెర్చ్ పరీక్షలు నిర్వహించడం జరిగిందని యాలాల మండల ఎంఈఓ మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు.
వికారాబాద్ జిల్లా యాలాల్ మండలంలోని అన్ని గ్రామాల్లో గల ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు మండల్ టాలెంట్ సెర్చ్ పరీక్షలు యలల ఎంఈఓ మైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ పరీక్షలకు మండలంలోని 50 ప్రభుత్వ పాఠశాలలు మరియు 6 ప్రైవేట్ పాఠశాలల నుండి సుమారు 600 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందులో 450 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, 150 మంది ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు ఉన్నారు.
ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం నిర్వహించిన ఈ పరీక్షలను రాత పరీక్ష రూపంలో నిర్వహించారు. ఇందులో EVS, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సాధారణ జ్ఞానం (GK) వంటి అంశాలను చేర్చారు.విద్యార్థులను SA-II పరీక్షలకు సిద్ధం చేయడం ప్రధాన ఉద్దేశ్యంగా MRC ఆధ్వర్యంలో అన్ని సబ్జెక్టులపై సుమారు 200 ప్రశ్నలతో మొత్తం 1000 ప్రశ్నల ప్రిపరేషన్ మెటీరియల్‌ను రూపొందించారు. పరీక్షల రాసిన అనంతరం ఉత్తీర్ణులైన
ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు యాలల ఎంఈఓ మహిపాల్ రెడ్డి ద్వారా మెడల్స్ మరియు ప్రశంస పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎంఈఓ. మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ,...ఇలాంటి పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి, వివేచన శక్తి, అవగాహన, సృజనాత్మకత మరియు పోటీతత్వం పెరుగుతాయని తెలిపారు. భవిష్యత్తులో రానున్న పరిజ్ఞానం విద్యార్థులకు పెంపొందించిన వారిమవుతామని అన్నారు.అలాగే గణితంలోని నాలుగు ప్రధాన ప్రక్రియలు — ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ — మరియు సాధారణ జ్ఞానం అంశాల్లో అభ్యాసం మెరుగుపడుతుందని అన్నారు. ఈ పరీక్షలులకు