19 ఏళ్లుగా నిరంతర సేవ.. కటకం ఫ్యామిలీ చలివేంద్రం ఆదర్శం..ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.
ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా చలివేంద్రం ప్రారంభం
రైతులు, కూలీల దాహార్తి తీర్చే సేవకు ప్రశంసలు
తాండూరు పట్టణంలో సేవా స్పూర్తికి నిదర్శనంగా నిలిచిన కటకం కుటుంబం మరోసారి ఆదర్శంగా నిలిచింది. కీర్తిశేషులు కటకం వీరయ్య జ్ఞాపకార్థంగా గత 19 సంవత్సరాలుగా నిరంతరంగా నిర్వహిస్తున్న చలివేంద్రం ఈ ఏడాది కూడా ఘనంగా ప్రారంభమైంది.
గురువారం తాండూర్ పట్టణంలోని గంజ్ కూడలిలో కటకం వీరేందర్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు కలిసి పూజలు నిర్వహించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, గత 19 సంవత్సరాలుగా ఎటువంటి విరామం లేకుండా వేసవికాలంలో చలివేంద్రం నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా గంజ్ ప్రాంతానికి వచ్చే రైతులు, కూలీలు, కార్మికులకు వేసవి దాహార్తి తీర్చడం గొప్ప సేవ అని కొనియాడారు.
కటకం వీరేందర్ ఫ్యామిలీ చేస్తున్న ఈ సేవా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మంచి మార్పుకు దారితీస్తాయని అన్నారు.
మరోవైపు కటకం వీరేందర్ మాట్లాడుతూ.. ఆర్యవైశ్య యువజన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఈ చలివేంద్రం నిరంతరంగా కొనసాగిస్తున్నామని అన్నారు ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు మురళీకృష్ణ, కార్యదర్శి కిరణ్ కుమార్, కార్యవర్గ సభ్యులు, ప్రజా ప్రతినిధులు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
19 ఏళ్లుగా నిరంతర సేవ.. కటకం ఫ్యామిలీ చలివేంద్రం ఆదర్శం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.