*డప్పు కళాకారులకు ఏపీ మాదిరిగా తెలంగాణ లో కూడా పెన్షన్ ఇవ్వాలి*
*ప్రాచీన డప్పుకళకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలి*
*కేవీపీస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య డిమాండ్*
యాలాల.*. వికారాబాద్ జిల్లా యాలాల మండల కేంద్రం లో బుధవారం మండల తహసీల్దార్ కార్యాలయం లో మండల ఆర్. ఐ.వేణుకుమార్ డప్పు కళాకారుల కు ఆంధ్రప్రదేశ్ తరహాలో తెలంగాణ లో కూడా డప్పు కళాకారులకు పెన్షన్ ఇవ్వాలని సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా కేవీపీస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య మాట్లాడుతూ ప్రాచీన కళగా పేరొందిన డప్పు కళకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యతనిచ్చి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డప్పు కళాకారులకు 5 వేల రూపాయలు పెన్షన్ ఇస్తుందని తెలంగాణ ప్రభుత్వం కూడా డప్పు కళాకారులకు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాచీన కాలం నుండి ప్రజలకు ఒక సారథిగా వారధిగా ప్రచార సాధనంగా ఉన్న డప్పు కళకు ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వడం లేదన్నారు .శుభ అశుభ కార్యక్రమాలు ఉత్సవాలు జాతరలు పండుగలు అన్నిటికి ముందు ఉండే డప్పు కళాకారుడికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ 7,000 రూ.లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.డప్పు కళాకారులందరికీ వెంటనే డిజిటల్ గుర్తింపు కార్డులు జారీ,చేయాలన్నారు.కేవలం వృద్ధులకే కాకుండా,వృత్తిని నమ్ముకున్న చురుకైన డప్పు కళాకారులందరికీ నెలవారీ గౌరవ వేతనం అందించాలన్నారు.డప్పు కళాకారులకు ఉచితంగా ఆరోగ్య బీమా కల్పించాలని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమం లో పల్లె శ్రీనివాస్,సంగేమ్ లాలప్ప, ఉప్పలి చిన్న నర్సిములు,నక్కలి జీవప్ప,ఉప్పలి పెద్ద చంద్రయ్య,జోగు అశోక్,బుద్దారం రాములు,మలిగేరి మురళి తదితరులు పాల్గొన్నారు.
డప్పు కళాకారులకు ఏపీ మాదిరిగా తెలంగాణ లో కూడా పెన్షన్ ఇవ్వాలి
*డప్పు కళాకారులకు ఏపీ మాదిరిగా తెలంగాణ లో కూడా పెన్షన్ ఇవ్వాలి*
*ప్రాచీన డప్పుకళకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలి*
*కేవీపీస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య డిమాండ్*యాలాల.*. వికారాబాద్ జిల్లా యాలాల మండల కేంద్రం లో బుధవారం మండల తహసీల్దార్ కార్యాలయం లో మండల ఆర్. ఐ.వేణుకుమార్ డప్పు కళాకారుల కు ఆంధ్రప్రదేశ్ తరహాలో తెలంగాణ లో కూడా డప్పు కళాకారులకు పెన్షన్ ఇవ్వాలని సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా కేవీపీస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య మాట్లాడుతూ ప్రాచీన కళగా పేరొందిన డప్పు కళకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యతనిచ్చి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డప్పు కళాకారులకు 5 వేల రూపాయలు పెన్షన్ ఇస్తుందని తెలంగాణ ప్రభుత్వం కూడా డప్పు కళాకారులకు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాచీన కాలం నుండి ప్రజలకు ఒక సారథిగా వారధిగా ప్రచార సాధనంగా ఉన్న డప్పు కళకు ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వడం లేదన్నారు .శుభ అశుభ కార్యక్రమాలు ఉత్సవాలు జాతరలు పండుగలు అన్నిటికి ముందు ఉండే డప్పు కళాకారుడికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ 7,000 రూ.లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.డప్పు కళాకారులందరికీ వెంటనే డిజిటల్ గుర్తింపు కార్డులు జారీ,చేయాలన్నారు.కేవలం వృద్ధులకే కాకుండా,వృత్తిని నమ్ముకున్న చురుకైన డప్పు కళాకారులందరికీ నెలవారీ గౌరవ వేతనం అందించాలన్నారు.డప్పు కళాకారులకు ఉచితంగా ఆరోగ్య బీమా కల్పించాలని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమం లో పల్లె శ్రీనివాస్,సంగేమ్ లాలప్ప, ఉప్పలి చిన్న నర్సిములు,నక్కలి జీవప్ప,ఉప్పలి పెద్ద చంద్రయ్య,జోగు అశోక్,బుద్దారం రాములు,మలిగేరి మురళి తదితరులు పాల్గొన్నారు.
