రాష్ డ్రైవింగ్‌తో ఇసుక ట్రాక్టర్ల రోతన… కాలనీవాసుల ఆగ్రహం
రోడ్డు పై స్తంభాలు, మొద్దులు పేర్చి వినూత్న నిరసన
దుమ్ము-ధూళితో పిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురవుతున్నారని ఆరోపణ
అనుమతికి మించి ట్రిప్పులు… అక్రమ రవాణాపై కాలనీవాసుల విమర్శలు
సంతకాల సేకరణతో తహసిల్దార్, పోలీసులకు వినతిపత్రం ఇవ్వనున్న ప్రజలు
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని వార్డు నెంబర్ 17 పరిధిలోని పాత తాండూరు గడీ ప్రాంతంలో ఇసుక ట్రాక్టర్ల రాష్ డ్రైవింగ్‌పై కాలనీవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజూ వందల సంఖ్యలో వెళ్లే ఇసుక ట్రాక్టర్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ట్రాక్టర్లు అధిక వేగంతో వెళ్తుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు రోడ్డుపై నడవడానికి కూడా భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కాలనీవాసులు రోడ్డుపై స్తంభాలు, మొద్దులు పేర్చి నిరసన వ్యక్తం చేశారు.
ఇసుక ట్రాక్టర్ల కారణంగా ఎగిసే దుమ్ము, ధూళి ఇళ్లలోకి చేరుతుండటంతో ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు.
ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేవలం రెండు ట్రాక్టర్లకు మాత్రమే అనుమతి ఇచ్చినప్పటికీ, ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఒక్కో ట్రాక్టర్ పదుల సంఖ్యలో ట్రిప్పులు చేస్తున్నాయని కాలనీవాసులు ఆరోపించారు. ఇది పూర్తిగా అక్రమ రవాణా అని విమర్శించారు.
రోజూ ఇక్కడి నుంచి వెళ్లే ట్రాక్టర్ల సంఖ్య చూస్తే, రాష్ట్రంలోని అన్ని ఇందిరమ్మ ఇళ్లను నిర్మించవచ్చని స్థానికులు ఎద్దేవా చేశారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ కాలనీలో ఇసుక ట్రాక్టర్ల రాకపోకలను నియంత్రించాలని, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాలనీవాసులు సంతకాల సేకరణ చేపట్టి, తహసిల్దార్ మరియు పట్టణ పోలీసులకు వినతిపత్రం అందించేందుకు సిద్ధమవుతున్నారు.
రాష్ డ్రైవింగ్‌తో ఇసుక ట్రాక్టర్ల రోతన… కాలనీవాసుల ఆగ్రహం
రాష్ డ్రైవింగ్‌తో ఇసుక ట్రాక్టర్ల రోతన… కాలనీవాసుల ఆగ్రహం
రోడ్డు పై స్తంభాలు, మొద్దులు పేర్చి వినూత్న నిరసన
దుమ్ము-ధూళితో పిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురవుతున్నారని ఆరోపణ
అనుమతికి మించి ట్రిప్పులు… అక్రమ రవాణాపై కాలనీవాసుల విమర్శలు
సంతకాల సేకరణతో తహసిల్దార్, పోలీసులకు వినతిపత్రం ఇవ్వనున్న ప్రజలువికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని వార్డు నెంబర్ 17 పరిధిలోని పాత తాండూరు గడీ ప్రాంతంలో ఇసుక ట్రాక్టర్ల రాష్ డ్రైవింగ్‌పై కాలనీవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజూ వందల సంఖ్యలో వెళ్లే ఇసుక ట్రాక్టర్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.