వీరశైవ సమాజం ఎన్నికల ప్రక్రియ ప్రారంభం…. లాటరీ విధానంలో 49 మంది అభ్యర్థులకు క్రమ సంఖ్యల కేటాయింపు

వీరశైవ సమాజం ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

లాటరీ విధానంలో 49 మంది అభ్యర్థులకు క్రమ సంఖ్యల కేటాయింపు

ఈనెల 26న ఎన్నికలు – దాసోహం ప్రాంగణంలో ఓటింగ్

ఓటర్లకు కఠిన నిబంధనలు – మొబైల్ ఫోన్లకు నో ఎంట్రీ..గుర్తింపు కార్డులు తప్పనిసరి:

ఎన్నికల ప్రధానాధికారి బిర్కాడ్ నారాయణ

తాండూర్ పట్టణంలో వీరశైవ సమాజం 2026–28 సంవత్సరాల ఎన్నికల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం వీరశైవ సమాజం కార్యాలయ ఆవరణలో కీలక కార్యక్రమం నిర్వహించారు. నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులకు లాటరీ విధానంలో క్రమ సంఖ్యలను కేటాయించారు.మొత్తం 49 మంది అభ్యర్థులకు ఈ లాటరీ ప్రక్రియ ద్వారా సంఖ్యలను కేటాయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్నికల ప్రధానాధికారి బిర్కాడ్ నారాయణ పాల్గొని ప్రక్రియను పర్యవేక్షించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2026–28 సంవత్సరాల ఎన్నికలను ఈనెల 26వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికలు సమాజ ఆవరణలోని దాసోహం ప్రాంగణంలో జరగనున్నాయని పేర్కొన్నారు. ఓటింగ్ పూర్తయిన వెంటనే కౌంటింగ్ ప్రక్రియను కూడా కొనసాగిస్తామని వెల్లడించారు.ఎన్నికల సందర్భంగా ఓటర్లు కచ్చితంగా నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు అనుమతించబడవని స్పష్టం చేశారు. ఓటింగ్‌కు హాజరయ్యే సభ్యులు ప్రభుత్వ గుర్తింపు కార్డు తో పాటు సమాజం ఇచ్చిన గుర్తింపు కార్డును కూడా తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు,సహాయ ఎన్నికల అధికారులు కొత్తపల్లి ప్రకాష్, కొడ్లి సతీష్ కుమార్, చాట్ల రాజశేఖర్ మరియు సమాజ సభ్యులు మరియు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🗓 14 Apr 2026 | 09:05 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top