ఘనంగా తాండూరులో శ్రీ భావిగి భద్రేశ్వరస్వామి జాతరోత్సవాలు అంగరంగ వైభవంగా రథోత్సవం

ఘనంగా తాండూరులో శ్రీ భావిగి భద్రేశ్వరస్వామి జాతరోత్సవాలు అంగరంగ వైభవంగా
రథోత్సవం

వేలాదిగా తరలివచ్చిన భక్తులు

55 అడుగుల ఎత్తైన రథం ప్రత్యేక ఆకర్షణ

కలశానికి అరటిపళ్లు విసిరిన భక్తులు – కోర్కెల నెరవేర్పు విశ్వాసం

విద్యుత్ దీపాలతో ఆలయ పరిసరాలు కనుల విందు

ఈరోజు అర్ధరాత్రి లంకాదహనం కార్యక్రమం

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని శ్రీ భావిగి భద్రేశ్వరస్వామి జాతరోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం నుంచే భక్తులతో పట్టణం కిటకిటలాడింది. ఎటు చూసినా జనసందోహం కనిపించగా, ఆలయ పరిసరాలు భక్తి భావంతో మార్మోగాయి.ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు నిర్వహించారు. రాష్ట్రంలోనే ఎత్తైనదిగా పేరుగాంచిన 55 అడుగుల రథానికి కలశపూజ నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాత్రి జరిగిన ప్రధాన ఘట్టమైన రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.పూలతో అలంకరించిన రథంపై పూర్ణాహుతి అనంతరం స్వామివారిని ప్రతిష్ఠించడంతో రథం కదిలింది. బసవన్న కట్ట నుంచి భద్రేశ్వర కూడలి వరకు సాగిన రథోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో బద్రేశ్వరచౌక్, గాంధీచౌక్, బసవన్నకట్ట, శాంతమహల్ థియేటర్, మార్వాడీ బజార్ ప్రాంతాలు జనంతో నిండిపోయాయి.
రథోత్సవంలో తెలుగు, కర్ణాటక సంప్రదాయాల సమ్మేళనం ప్రత్యేకంగా కనిపించింది. కర్ణాటక సంస్కృతి ప్రతిబింబించే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం విశేషం. వేద మంత్రోచ్ఛరణల మధ్య “భద్రేశ్వరుడికి జై” అంటూ నినాదాలతో ఊరేగింపు భక్తి పారవశ్యాన్ని కలిగించింది.రథాన్ని లాగుతున్న సమయంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జనాన్ని నియంత్రించేందుకు తాళ్లతో ఇరువైపులా నిరోధాలు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా భక్తులు తమ కోరికలు నెరవేరాలని ఆశిస్తూ అరటిపళ్లను కలశంపైకి విసిరారు. కలశానికి పండు తాకితే కోరిక నెరవేరుతుందనే విశ్వాసంతో ఈ కార్యక్రమం నిర్వహించడం విశేషంగా నిలిచింది.
కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ మేడి మహేష్, ఈవో శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా, జాతరలో రెండో ప్రధాన ఘట్టమైన లంకాదహనం ఆదివారం రాత్రి ఒంటి గంటకు జరగనుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ మేడి మహేష్ తెలిపారు.

ఘనంగా తాండూరులో శ్రీ భావిగి భద్రేశ్వరస్వామి జాతరోత్సవాలు అంగరంగ వైభవంగా రథోత్సవం

ఘనంగా తాండూరులో శ్రీ భావిగి భద్రేశ్వరస్వామి జాతరోత్సవాలు అంగరంగ వైభవంగా
రథోత్సవం

వేలాదిగా తరలివచ్చిన భక్తులు

55 అడుగుల ఎత్తైన రథం ప్రత్యేక ఆకర్షణ

కలశానికి అరటిపళ్లు విసిరిన భక్తులు – కోర్కెల నెరవేర్పు విశ్వాసం

విద్యుత్ దీపాలతో ఆలయ పరిసరాలు కనుల విందు

ఈరోజు అర్ధరాత్రి లంకాదహనం కార్యక్రమం

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని శ్రీ భావిగి భద్రేశ్వరస్వామి జాతరోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం నుంచే భక్తులతో పట్టణం కిటకిటలాడింది. ఎటు చూసినా జనసందోహం కనిపించగా, ఆలయ పరిసరాలు భక్తి భావంతో మార్మోగాయి.ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు నిర్వహించారు. రాష్ట్రంలోనే ఎత్తైనదిగా పేరుగాంచిన 55 అడుగుల రథానికి కలశపూజ నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాత్రి జరిగిన ప్రధాన ఘట్టమైన రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.పూలతో అలంకరించిన రథంపై పూర్ణాహుతి అనంతరం స్వామివారిని ప్రతిష్ఠించడంతో రథం కదిలింది. బసవన్న కట్ట నుంచి భద్రేశ్వర కూడలి వరకు సాగిన రథోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో బద్రేశ్వరచౌక్, గాంధీచౌక్, బసవన్నకట్ట, శాంతమహల్ థియేటర్, మార్వాడీ బజార్ ప్రాంతాలు జనంతో నిండిపోయాయి.
రథోత్సవంలో తెలుగు, కర్ణాటక సంప్రదాయాల సమ్మేళనం ప్రత్యేకంగా కనిపించింది. కర్ణాటక సంస్కృతి ప్రతిబింబించే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం విశేషం. వేద మంత్రోచ్ఛరణల మధ్య "భద్రేశ్వరుడికి జై" అంటూ నినాదాలతో ఊరేగింపు భక్తి పారవశ్యాన్ని కలిగించింది.రథాన్ని లాగుతున్న సమయంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జనాన్ని నియంత్రించేందుకు తాళ్లతో ఇరువైపులా నిరోధాలు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా భక్తులు తమ కోరికలు నెరవేరాలని ఆశిస్తూ అరటిపళ్లను కలశంపైకి విసిరారు. కలశానికి పండు తాకితే కోరిక నెరవేరుతుందనే విశ్వాసంతో ఈ కార్యక్రమం నిర్వహించడం విశేషంగా నిలిచింది.
కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ మేడి మహేష్, ఈవో శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా, జాతరలో రెండో ప్రధాన ఘట్టమైన లంకాదహనం ఆదివారం రాత్రి ఒంటి గంటకు జరగనుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ మేడి మహేష్ తెలిపారు.

🗓 12 Apr 2026 | 10:37 AM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top