రాడికల్ బయో ఆర్గానిక్ ఇండస్ట్రీస్‌లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎండీ బుయ్యని సరళా రెడ్డి

రాడికల్ బయో ఆర్గానిక్ ఇండస్ట్రీస్‌లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎండీ బుయ్యని సరళా రెడ్డి

యాలాల మండలం జక్కెపల్లి గ్రామంలోని **రాడికల్ బయో ఆర్గానిక్ ఇండస్ట్రీస్ (RBOL)**లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బుయ్యని సరళా రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు.
కార్యక్రమంలో సంస్థకు చెందిన అధికారులు, సిబ్బంది, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సరళా రెడ్డి ఉద్యోగులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ ఉద్యోగులంతా దేశభక్తి, జాతీయ స్ఫూర్తితో కార్యక్రమంలో పాల్గొన్నారు. సంస్థ ఆవరణలో జాతీయ జెండా రెపరెపలాడుతుండగా.. ఉద్యోగుల సమిష్టి భాగస్వామ్యంతో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి.

🗓 15 Aug 2026 | 01:01 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top