బెల్లం కాదది.. తీపి విషం! • 7,500 కిలోల కుళ్లిపోయిన కల్తీ బెల్లం గుట్టురట్టు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు

బెల్లం కాదది.. తీపి విషం!

• 7,500 కిలోల కుళ్లిపోయిన కల్తీ బెల్లం గుట్టురట్టు
చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు

•తాండూర్‌కు అక్రమ రవాణా చేస్తుండగా దాడి

బోపనారంలో విక్రేతలతో సహా ఆటో సీజ్.. ఇద్దరి పై కేసు నమోదు.

అది ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న నల్ల దందా.. తీపి పేరుతో నాసిరకం, కుళ్లిపోయిన సరుకును మార్కెట్లోకి వదిలి సొమ్ము చేసుకుంటున్న వ్యాపారుల గుట్టును వికారాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPS గారి ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు ఏకంగా 7,500 కిలోల (7.5 టన్నులు) కల్తీ బెల్లాన్ని స్వాధీనం చేసుకుని సంచలనం సృష్టించారు.

టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ SK అన్వార్ పాషా ఆధ్వర్యంలో సిబ్బంది బంట్వారం మండలం బోపనారం గ్రామ పరిధిలో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వెళ్తున్న ఓ ఆటోను నిలిపి తనిఖీ చేయగా, అందులో తాండూర్ వైపు తరలిస్తున్న 4 క్వింటాళ్ల కుళ్లిపోయిన, కల్తీ బెల్లం లభ్యమైంది.
ఆటోలో ఉన్న చంద్ పాషా, డ్రైవర్ మొహమ్మద్ కుతుబొద్దీన్‌లను అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారించారు. వారిచ్చిన సమాచారంతో సదరు దుకాణంపై దాడి చేయగా నిల్వ ఉంచిన భారీ కల్తీ సరుకు బయటపడింది.
ఆటోలోని బెల్లంతో పాటు గోదాములో ఉన్న నిల్వలను కలిపి మొత్తం 7,500 కేజీల సరుకును పోలీసులు జప్తు చేశారు.

ఖబర్దార్.. కల్తీ చేస్తే కటకటాలే!

“ప్రజారోగ్యంతో చెలగాటమాడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. నాసిరకం, కల్తీ పదార్థాల తయారీ, రవాణాపై నిరంతరం నిఘా ఉంటుంది. జిల్లాలో ఎక్కడైనా కల్తీ దందా జరుగుతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతాం.అని
, టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్
SK అన్వార్ పాషా తెలిపారు.

బెల్లం కాదది.. తీపి విషం! • 7,500 కిలోల కుళ్లిపోయిన కల్తీ బెల్లం గుట్టురట్టు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు

బెల్లం కాదది.. తీపి విషం!

• 7,500 కిలోల కుళ్లిపోయిన కల్తీ బెల్లం గుట్టురట్టు
చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు

•తాండూర్‌కు అక్రమ రవాణా చేస్తుండగా దాడి

బోపనారంలో విక్రేతలతో సహా ఆటో సీజ్.. ఇద్దరి పై కేసు నమోదు.

అది ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న నల్ల దందా.. తీపి పేరుతో నాసిరకం, కుళ్లిపోయిన సరుకును మార్కెట్లోకి వదిలి సొమ్ము చేసుకుంటున్న వ్యాపారుల గుట్టును వికారాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPS గారి ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు ఏకంగా 7,500 కిలోల (7.5 టన్నులు) కల్తీ బెల్లాన్ని స్వాధీనం చేసుకుని సంచలనం సృష్టించారు.

టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ SK అన్వార్ పాషా ఆధ్వర్యంలో సిబ్బంది బంట్వారం మండలం బోపనారం గ్రామ పరిధిలో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వెళ్తున్న ఓ ఆటోను నిలిపి తనిఖీ చేయగా, అందులో తాండూర్ వైపు తరలిస్తున్న 4 క్వింటాళ్ల కుళ్లిపోయిన, కల్తీ బెల్లం లభ్యమైంది.
ఆటోలో ఉన్న చంద్ పాషా, డ్రైవర్ మొహమ్మద్ కుతుబొద్దీన్‌లను అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారించారు. వారిచ్చిన సమాచారంతో సదరు దుకాణంపై దాడి చేయగా నిల్వ ఉంచిన భారీ కల్తీ సరుకు బయటపడింది.
ఆటోలోని బెల్లంతో పాటు గోదాములో ఉన్న నిల్వలను కలిపి మొత్తం 7,500 కేజీల సరుకును పోలీసులు జప్తు చేశారు.

ఖబర్దార్.. కల్తీ చేస్తే కటకటాలే!

"ప్రజారోగ్యంతో చెలగాటమాడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. నాసిరకం, కల్తీ పదార్థాల తయారీ, రవాణాపై నిరంతరం నిఘా ఉంటుంది. జిల్లాలో ఎక్కడైనా కల్తీ దందా జరుగుతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతాం.అని
, టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్
SK అన్వార్ పాషా తెలిపారు.

🗓 15 Aug 2026 | 07:43 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top