కన్నవారినే కాటికి పంపింది – ప్రియుడి మోజులో పడి తల్లిదండ్రులను చంపిన కూతురు

కన్నవారినే కాటికి పంపింది
– ప్రియుడి మోజులో పడి తల్లిదండ్రులను చంపిన కూతురు
– వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామంలో ఘటన

వికారాబాద్ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనను వింటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.. ఇంస్టాగ్రామ్ లో పరిచయమైన ఓ యువకుడి ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులతో చెప్పింది, అందుకు వారు ఒప్పుకోక పోవడంతో చంపైనా సరే పెళ్లి చేసుకోవాలని పథకం పన్ని కని పెంచిన తల్లిదండ్రులకు మరణ శాసనం రాసి పథకం ప్రకారం మట్టు పెట్టింది.ఇక వివరాల్లోకి వెళితే వికారాబాద్ జిల్లా బంటారం మండలం యాచారం గ్రామానికి చెందిన నక్కలి దశరథం లక్ష్మి దంపతులకు చివరి సంతానం అయిన చిన్న కూతురు నక్కలి సురేఖ(25) బీఎస్సీ నర్సింగ్ చేసి సంగారెడ్డి లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తుంది. గత ఏడాది క్రితం ఇంస్టాగ్రామ్ లో పరిచయమైన యువకుడితో ప్రేమలో పడింది. ప్రేమాభిషేయమై తల్లిదండ్రులకు చెప్పడంతో వేరే కులానికి చెందిన వాడు కావడంతో వ్యతిరేకించారు. ఇదే విషయమై పేరెంట్స్ తో పలుమార్లు గొడవ పడింది. దీంతో హత్య చేసైనా పెళ్లి చేసుకోవాలని ఉద్దేశంతో ముందుగా పతకం రచించినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. నిందితురాలు పనిచేస్తున్న హాస్పిటల్ లో నుండి అట్రాసిల్ ఇంజక్షన్లు 4 బాటిల్లను దొంగతనంగా సేకరించింది. పథకం ప్రకారం ఈ నెల 24వ తేదీన ఆసుపత్రిలో సెలవు తీసుకొని సంగారెడ్డి నుండి మోమిన్ పేటకు వచ్చి అక్కడ ఒక మెడికల్ షాపులో మూడు సిరంజిలను తీసుకొని స్వగ్రామమైన యాచారం కు వచ్చింది. రాత్రి పడుకునే ముందు తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసి, మళ్లీ ఒకసారి ప్రేమ పెళ్లి గురించి తల్లిదండ్రులను అడిగింది, దానికి వారు వద్దు అని చెప్పడంతో ముందుగా అనుకున్నట్లుగా తన తల్లితో ఒళ్ళు నొప్పులు తగ్గించడానికి మందు తెచ్చానని రాత్రి పది గంటల సమయంలో “అట్రాసిల్ 5 ఎంఎల్” ఇంజక్షన్ ను ఇక మోతాదులో ఇవ్వడంతో తల్లి కుప్పకూలిపోయింది. అనంతరం బయట నుండి చలిమంట కాచుకొని వచ్చిన తన తండ్రి నక్కలి దశరథం కు అమ్మ పడుకుందని చెప్పి తనకు కూడా ఒళ్ళు నొప్పులు మందు తెచ్చానని తండ్రికి కూడా ఇంజక్షన్ ఇవ్వడంతో వెంటనే కుప్ప కూలిపోయి మరణించాడు. వీళ్ళ మరణాలను సహజ మరణంగా చిత్రీకరించినందుకు నిందితురాలు తన అన్నకు ఫోన్ చేసి అమ్మానాన్న చనిపోయారు నాకు భయం వేస్తుంది తొందరగా రండి అని చెప్పి అతడు వచ్చాక నాన్న తనతో మాట్లాడుతూ అన్నతో మంచిగా ఉండు అన్న చెప్పినట్లు విను అన్ననే అన్నీ చూసుకుంటాడు అని చెబుతూ అకస్మాత్తుగా పడిపోయాడని పక్కనే ఉన్న తన అమ్మకు చెప్పగా షాక్కు గురై అమ్మ కూడా స్పృహ తప్పి పడిపోయిందని, సిపిఆర్ చేసిన చనిపోయిందని కట్టు కథ చెప్పింది.

*పిర్యాదుతో అసలు నిజం బయటకు*
తమ తల్లిదండ్రులు అనుమానాస్పదంగా మరణానికి గురయ్యారని ఫిర్యాదు చేయగా.. విచారణ చేపట్టిన పోలీసులు నేర స్థలంలో వాడబడిన రెండు సిరంజీలు వాటికి రక్తం చుక్కలు కలిగి కనిపించడంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. మృతుల కుటుంబ సభ్యులకు, స్థానికులకు చిన్న కూతురైన సురేఖపై అనుమానం వ్యక్తం చేయగా పోలీసులు ఆమెని విచారించారు. కులాంతర వివాహానికి అడ్డువచ్చిన తన తల్లిదండ్రులను తానే చంపానని నేరం అంగీకరించినట్లు వికారాబాద్ డిఎస్పి విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలను వెల్లడించడం జరిగింది. సమావేశంలో ధరూర్ సీఐ రఘు రాములు, బంటారం ఎస్సై విమల ఉన్నారు.

కన్నవారినే కాటికి పంపింది – ప్రియుడి మోజులో పడి తల్లిదండ్రులను చంపిన కూతురు

కన్నవారినే కాటికి పంపింది
- ప్రియుడి మోజులో పడి తల్లిదండ్రులను చంపిన కూతురు
- వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామంలో ఘటన

వికారాబాద్ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనను వింటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.. ఇంస్టాగ్రామ్ లో పరిచయమైన ఓ యువకుడి ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులతో చెప్పింది, అందుకు వారు ఒప్పుకోక పోవడంతో చంపైనా సరే పెళ్లి చేసుకోవాలని పథకం పన్ని కని పెంచిన తల్లిదండ్రులకు మరణ శాసనం రాసి పథకం ప్రకారం మట్టు పెట్టింది.ఇక వివరాల్లోకి వెళితే వికారాబాద్ జిల్లా బంటారం మండలం యాచారం గ్రామానికి చెందిన నక్కలి దశరథం లక్ష్మి దంపతులకు చివరి సంతానం అయిన చిన్న కూతురు నక్కలి సురేఖ(25) బీఎస్సీ నర్సింగ్ చేసి సంగారెడ్డి లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తుంది. గత ఏడాది క్రితం ఇంస్టాగ్రామ్ లో పరిచయమైన యువకుడితో ప్రేమలో పడింది. ప్రేమాభిషేయమై తల్లిదండ్రులకు చెప్పడంతో వేరే కులానికి చెందిన వాడు కావడంతో వ్యతిరేకించారు. ఇదే విషయమై పేరెంట్స్ తో పలుమార్లు గొడవ పడింది. దీంతో హత్య చేసైనా పెళ్లి చేసుకోవాలని ఉద్దేశంతో ముందుగా పతకం రచించినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. నిందితురాలు పనిచేస్తున్న హాస్పిటల్ లో నుండి అట్రాసిల్ ఇంజక్షన్లు 4 బాటిల్లను దొంగతనంగా సేకరించింది. పథకం ప్రకారం ఈ నెల 24వ తేదీన ఆసుపత్రిలో సెలవు తీసుకొని సంగారెడ్డి నుండి మోమిన్ పేటకు వచ్చి అక్కడ ఒక మెడికల్ షాపులో మూడు సిరంజిలను తీసుకొని స్వగ్రామమైన యాచారం కు వచ్చింది. రాత్రి పడుకునే ముందు తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసి, మళ్లీ ఒకసారి ప్రేమ పెళ్లి గురించి తల్లిదండ్రులను అడిగింది, దానికి వారు వద్దు అని చెప్పడంతో ముందుగా అనుకున్నట్లుగా తన తల్లితో ఒళ్ళు నొప్పులు తగ్గించడానికి మందు తెచ్చానని రాత్రి పది గంటల సమయంలో "అట్రాసిల్ 5 ఎంఎల్" ఇంజక్షన్ ను ఇక మోతాదులో ఇవ్వడంతో తల్లి కుప్పకూలిపోయింది. అనంతరం బయట నుండి చలిమంట కాచుకొని వచ్చిన తన తండ్రి నక్కలి దశరథం కు అమ్మ పడుకుందని చెప్పి తనకు కూడా ఒళ్ళు నొప్పులు మందు తెచ్చానని తండ్రికి కూడా ఇంజక్షన్ ఇవ్వడంతో వెంటనే కుప్ప కూలిపోయి మరణించాడు. వీళ్ళ మరణాలను సహజ మరణంగా చిత్రీకరించినందుకు నిందితురాలు తన అన్నకు ఫోన్ చేసి అమ్మానాన్న చనిపోయారు నాకు భయం వేస్తుంది తొందరగా రండి అని చెప్పి అతడు వచ్చాక నాన్న తనతో మాట్లాడుతూ అన్నతో మంచిగా ఉండు అన్న చెప్పినట్లు విను అన్ననే అన్నీ చూసుకుంటాడు అని చెబుతూ అకస్మాత్తుగా పడిపోయాడని పక్కనే ఉన్న తన అమ్మకు చెప్పగా షాక్కు గురై అమ్మ కూడా స్పృహ తప్పి పడిపోయిందని, సిపిఆర్ చేసిన చనిపోయిందని కట్టు కథ చెప్పింది.

*పిర్యాదుతో అసలు నిజం బయటకు*
తమ తల్లిదండ్రులు అనుమానాస్పదంగా మరణానికి గురయ్యారని ఫిర్యాదు చేయగా.. విచారణ చేపట్టిన పోలీసులు నేర స్థలంలో వాడబడిన రెండు సిరంజీలు వాటికి రక్తం చుక్కలు కలిగి కనిపించడంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. మృతుల కుటుంబ సభ్యులకు, స్థానికులకు చిన్న కూతురైన సురేఖపై అనుమానం వ్యక్తం చేయగా పోలీసులు ఆమెని విచారించారు. కులాంతర వివాహానికి అడ్డువచ్చిన తన తల్లిదండ్రులను తానే చంపానని నేరం అంగీకరించినట్లు వికారాబాద్ డిఎస్పి విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలను వెల్లడించడం జరిగింది. సమావేశంలో ధరూర్ సీఐ రఘు రాములు, బంటారం ఎస్సై విమల ఉన్నారు.

🗓 29 Jan 2026 | 01:03 AM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top