అధికార కాంగ్రెస్ పార్టీ కుల దురహంకారమా..?

– పసికూన హత్య, మహిళలపై, బీసీలపై దాడి సిగ్గుచేటు

– బిఆర్ఎస్ యువ నాయకుడు ఆర్.విజయ్ రాజ్

వికారాబాద్:అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్ల జరిగిన ఈ దారుణ ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. నాగర్‌కర్నూల్ జిల్లా తాండూర్ మండలంలోని కుమ్మేర మల్లన్న జాతర సందర్భంగా చాకలి కుటుంబంపై కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యం ప్రదర్శించి, తల్లి పొత్తిలో ఉన్న పసికందును కాళ్లతో తన్ని, గొంతు నులిమి చంపడం అమానుషం. క్రూరత్వానికి, కుల దురహంకారానికి నిదర్శనంగా ఉన్న ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ఆర్. విజయ్ రాజ్ అన్నారు. కేవలం ఒక కుటుంబంపై జరిగిన దాడిగా కాకుండా, మహిళల గౌరవం పై, దళిత, బీసీ సమాజంపై, మానవ హక్కులపై జరిగిన దాడిగా చూస్తున్నాం. ఏమాత్రం జవాబుదారీతనం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలనీ, నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

దైవ దర్శనం కోసం వచ్చిన ఆ కుటుంబం తమ దగ్గర డబ్బులు లేవని, బయట నుంచే దర్శనం చేసుకుంటామని చెప్పినా వినకుండా ఆధిపత్య కుల, వర్గ అహంకారంతో ఇంతటి దుశ్చర్యకు పాల్పడటం అత్యంత దారుణం.

అధికార కాంగ్రెస్ పార్టీ కుల దురహంకారమా..?

- పసికూన హత్య, మహిళలపై, బీసీలపై దాడి సిగ్గుచేటు

- బిఆర్ఎస్ యువ నాయకుడు ఆర్.విజయ్ రాజ్

వికారాబాద్:అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్ల జరిగిన ఈ దారుణ ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. నాగర్‌కర్నూల్ జిల్లా తాండూర్ మండలంలోని కుమ్మేర మల్లన్న జాతర సందర్భంగా చాకలి కుటుంబంపై కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యం ప్రదర్శించి, తల్లి పొత్తిలో ఉన్న పసికందును కాళ్లతో తన్ని, గొంతు నులిమి చంపడం అమానుషం. క్రూరత్వానికి, కుల దురహంకారానికి నిదర్శనంగా ఉన్న ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ఆర్. విజయ్ రాజ్ అన్నారు. కేవలం ఒక కుటుంబంపై జరిగిన దాడిగా కాకుండా, మహిళల గౌరవం పై, దళిత, బీసీ సమాజంపై, మానవ హక్కులపై జరిగిన దాడిగా చూస్తున్నాం. ఏమాత్రం జవాబుదారీతనం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలనీ, నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

దైవ దర్శనం కోసం వచ్చిన ఆ కుటుంబం తమ దగ్గర డబ్బులు లేవని, బయట నుంచే దర్శనం చేసుకుంటామని చెప్పినా వినకుండా ఆధిపత్య కుల, వర్గ అహంకారంతో ఇంతటి దుశ్చర్యకు పాల్పడటం అత్యంత దారుణం.

🗓 26 Feb 2026 | 01:59 PM ✍ Arunreddy https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top