*రైతుల కష్టాన్ని దోపిడీ చేయడం అన్యాయం*
– *అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర అసహనం*
– *జిల్లా వ్యాప్తంగా రైతుల భారీ సమావేశం*

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో సోమవారం జిల్లా వ్యాప్తంగా రైతులు భారీగా సమావేశమై తమ సమస్యలను వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ రైతు సంఘం నాయకులు గట్టిగా స్పందించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర రైతు సంఘ అధ్యక్షుడు కోదండ రెడ్డి మాట్లాడుతూ, రైతుల సమస్యలను అధికారులు పట్టించుకోకపోతే సహించబోమని స్పష్టం చేశారు. మార్కెట్ యార్డ్‌లో జరుగుతున్న దోపిడీ, అక్రమాలపై రైతులు వివరించిన సమస్యలను ఆయన వినిపించి, సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
రైతులు కష్టపడి పండించిన పంటలను మార్కెట్‌కు తీసుకువస్తే, వారి కష్టాన్ని దోపిడీ చేయడం అన్యాయమని నాయకులు మండిపడ్డారు. రైతు లేకపోతే రాజ్యం సుభిక్షంగా ఉండదు అని వారు పేర్కొన్నారు.ముఖ్యంగా మార్కెట్‌లో అమలవుతున్న విధానాలపై పలు డిమాండ్లు చేశారు. తూకంలో ఒక కిలో మాత్రమే జరుగు తీయాలని, ‘మొట్టి’ పూర్తిగా రద్దు చేయాలని కోరారు. అలాగే కమిషన్‌ను నాలుగు శాతం నుండి రెండు శాతానికి తగ్గించాలని, అంతకంటే ఎక్కువ వసూలు చేయరాదని స్పష్టం చేశారు.మార్కెట్‌కు వచ్చే రైతులకు ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడంపై కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు నిలువ నీడ, తాగునీరు, భోజనశాల, మరుగుదొడ్లు వంటి సదుపాయాలను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తక్ పట్టి (తూకం రసీదు) తప్పనిసరిగా ఇవ్వాలని కోరారు.రైతు రాజ్యం అని చెప్పుకుంటూనే రైతులను నిర్లక్ష్యం చేయడం సరికాదని అధికారులను హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘ నాయకులు రంగారావు, రాజారెడ్డి, జిల్లా అధ్యక్షుడు బోరెడ్డి నరసింహారెడ్డి, జోనల్ అధ్యక్షుడు మల్ రెడ్డి, కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శీను ముదిరాజ్, వైస్ చైర్మన్ మల్లేశం, చిగుళ్లపల్లి రమేష్, వ్యవసాయ శాఖ మార్కెట్ అధికారులు, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.
రైతుల కష్టాన్ని దోపిడీ చేయడం అన్యాయం* – *అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర అసహనం*
*రైతుల కష్టాన్ని దోపిడీ చేయడం అన్యాయం*
- *అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర అసహనం*
- *జిల్లా వ్యాప్తంగా రైతుల భారీ సమావేశం*