తాండూరులో ఉచిత క్యాన్సర్ శిబిరానికి భారీ స్పందన

350 మందికి పైగా స్క్రీనింగ్..జీవనశైలి మారితే క్యాన్సర్ దూరం

కిమ్స్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ మధు దేవర రెడ్డి.

క్యాన్సర్‌పై గెలుపు సాధ్యమే… ముందస్తు పరీక్షలే ఆయుధం!

తాండూర్ డీఎస్పీ నర్సింగ్ యాదయ్య

క్యాన్సర్ వ్యాధి అంటే భయపడాల్సిన పనిలేదని, ముందస్తుగా గుర్తిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చని తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, కిమ్స్ ఆసుపత్రి క్యాన్సర్ నిపుణులు డా. మధు దేవర శెట్టి అన్నారు.ఆదివారం తాండూరు పట్టణంలోని సాయితరుణ్ ఆసుపత్రిలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) అధ్యక్షులు డా. జయప్రసాద్ ఆధ్వర్యంలో, కిమ్స్ ఆసుపత్రి సంయుక్తంగా ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, వైద్యులతో కలిసి శిబిరాన్ని ప్రారంభించారు.ఈ శిబిరానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. తాండూరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి సుమారు 350 మందికి పైగా ప్రజలు హాజరై వివిధ పరీక్షలు చేయించుకున్నారు. శిబిరంలో మొత్తం 14 మంది వైద్యులు సేవలు అందించారు.150 మందికి పైగా రక్తపరీక్షలు, 63 మందికి అల్ట్రాసౌండ్ స్కానింగ్, 12 మందికి మమోగ్రఫీ, 8 మందికి ఎండోస్కోపీ, 69 మందికి ఎక్స్‌రే, 63 మందికి క్యాన్సర్ ప్రత్యేక పరీక్షలు, 53 మందికి పాప్ స్మియర్ పరీక్షలు నిర్వహించారు. మిగతా వారికి ఇతర ఆరోగ్య పరీక్షలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు శిబిరం కొనసాగింది.
ఈ సందర్భంగా డా. మధు దేవర శెట్టి మాట్లాడుతూ,.. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు క్యాన్సర్‌కు కారణమవుతున్నాయని తెలిపారు. దురాలవాట్లను దూరం చేసుకోవడం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్‌ను నివారించవచ్చని సూచించారు.
డీఎస్పీ నర్సింగ్ యాదయ్య మాట్లాడుతూ.., ప్రస్తుత కాలంలో క్యాన్సర్ వ్యాధి అంటే భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. సకాలంలో పరీక్షలు, సరైన వైద్యం తీసుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చని తెలిపారు. ప్రజలకు ఉచితంగా ఈ విధమైన వైద్య శిబిరం నిర్వహించిన ఐఎంఏ, కిమ్స్ ఆసుపత్రి వైద్యులను ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో కిమ్స్ ఆసుపత్రి వైద్యులు, తాండూరు ఐఎంఏ ప్రతినిధులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

🗓 29 Mar 2026 | 07:05 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top