దివ్యాంగుడికి దిక్సూచి…
జహ్రు హుస్సేన్‌కు ట్రైసైకిల్ అందించిన విద్యావంతుల వేదిక
సహాయం కాదు… స్వయం ఆధారిత జీవనానికి తొలి అడుగు
తెలంగాణ విద్యావంత వేదిక సభ్యులు
వికారాబాద్ జిల్లా యాలాల మండలం ముద్దాయిపేట గ్రామంలో మానవత్వం మెరిసిన ఒక హృదయాన్ని తాకే కార్యక్రమం జరిగింది. తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో నడవలేని స్థితిలో ఉన్న జహ్రు హుస్సేన్ కి ట్రైసైకిల్‌ను అందించారు. గ్రామస్థుల సమక్షంలో సాదాసీదాగా జరిగిన ఈ కార్యక్రమం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది.
ఈ సందర్భంగా విద్యావంతుల వేదిక నాయకులు రవీందర్ గౌడ్, కె. వెంకటరెడ్డి, గౌరారం గోపాల్ మాట్లాడుతూ…సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించడం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ముఖ్యంగా దివ్యాంగుల సంక్షేమం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని అన్నారు. సమాజంలోని ప్రతి వ్యక్తి సహకారంతోనే ఇలాంటి కార్యక్రమాలు విజయవంతం అవుతాయని స్పష్టం చేశారు.అనంతరం పలువురు
మాట్లాడుతూ ..జహ్రు హుస్సేన్ కి ట్రైసైకిల్ అందించడం ద్వారా ఆయన జీవన విధానంలో ఒక గొప్ప మార్పు తీసుకురావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సహాయం ద్వారా ఆయనకు కదలికలు సులభతరం కావడంతో పాటు స్వయం ఆధారిత జీవనం సాగించే అవకాశం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు రామచంద్రారెడ్డి, స్థానిక సర్పంచ్, ZPHS ముద్దాయిపేట అనిల్, ఐసీ హెచ్‌ఎం, పీఎస్ హెచ్‌ఎం కరుణాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్, గ్రామ పెద్దలు రాజప్ప, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు రమేష్, శ్రీనివాస్, పరమేశ్వరి, మహేశ్వరప్ప, దుద్యాల మండల ప్రధానోపాధ్యాయులు మల్లప్ప, ఉపాధ్యాయులు సుధాకర్, బొమ్మరాస్పేట మండలానికి చెందిన యూటీఎఫ్ నాయకులు సర్దార్ తదితరులు పాల్గొన్నారు.ఈ సేవా కార్యక్రమం ద్వారా ఒక వ్యక్తికి మాత్రమే కాకుండా సమాజానికి కూడా ఒక గొప్ప సందేశం వెళ్లింది. “సహాయం అంటే దానం కాదు… ఒకరి జీవితాన్ని మార్చే అవకాశం” అనే భావనను ఈ కార్యక్రమం మరింత బలపరిచింది.
దివ్యాంగుడికి దిక్సూచి… జహ్రు హుస్సేన్‌కు ట్రైసైకిల్ అందించిన విద్యావంతుల వేదిక
దివ్యాంగుడికి దిక్సూచి…
జహ్రు హుస్సేన్‌కు ట్రైసైకిల్ అందించిన విద్యావంతుల వేదిక
సహాయం కాదు… స్వయం ఆధారిత జీవనానికి తొలి అడుగు
తెలంగాణ విద్యావంత వేదిక సభ్యులు
వికారాబాద్ జిల్లా యాలాల మండలం ముద్దాయిపేట గ్రామంలో మానవత్వం మెరిసిన ఒక హృదయాన్ని తాకే కార్యక్రమం జరిగింది. తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో నడవలేని స్థితిలో ఉన్న జహ్రు హుస్సేన్ కి ట్రైసైకిల్‌ను అందించారు. గ్రామస్థుల సమక్షంలో సాదాసీదాగా జరిగిన ఈ కార్యక్రమం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది.
ఈ సందర్భంగా విద్యావంతుల వేదిక నాయకులు రవీందర్ గౌడ్, కె. వెంకటరెడ్డి, గౌరారం గోపాల్ మాట్లాడుతూ...సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించడం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ముఖ్యంగా దివ్యాంగుల సంక్షేమం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని అన్నారు. సమాజంలోని ప్రతి వ్యక్తి సహకారంతోనే ఇలాంటి కార్యక్రమాలు విజయవంతం అవుతాయని స్పష్టం చేశారు.అనంతరం పలువురు