తాండూర్ వీరశైవ సమాజంలో ఎన్నికల సందడి ప్రారంభం
– 2026-28 కార్యవర్గానికి ఏప్రిల్ 26న పోలింగ్
– నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రధాన అధికారి బిర్కడ్ నారాయణ
– ఏప్రిల్ 8 నుంచి ఎన్నికల కోడ్ అమలు
-పాత కార్యవర్గం పూర్తిగా రద్దు – కొత్త నాయకత్వానికి రంగం సిద్ధం

తాండూర్ నియోజకవర్గంలో అతి పెద్ద సమాజమైన వీరశైవ సమాజంలో ఎన్నికల వేడి మొదలైంది. 2026-28 సంవత్సరాల కార్యవర్గ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఎన్నికల ప్రధాన అధికారి బిర్కడ్ నారాయణ విడుదల చేశారు.మంగళవారం తాండూర్ పట్టణంలోని వీరశైవ సమాజ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సహాయ ఎన్నికల అధికారులు కొత్తపల్లి ప్రకాష్, కొడ్లి సతీష్ కుమార్, చాట్ల రాజశేఖర్ పాల్గొని నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ….సమాజ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ఏప్రిల్ 8 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 27 వరకు కొనసాగుతుందని వెల్లడించారు.
ఎన్నికల షెడ్యూల్ ఇలా ఉంది:
ఏప్రిల్ 8–12: నామినేషన్ పత్రాల స్వీకరణ
ఏప్రిల్ 13: నామినేషన్ పరిశీలన, అర్హుల జాబితా విడుదల
ఏప్రిల్ 14: ఉపసంహరణ & క్రమ సంఖ్యల కేటాయింపు
ఏప్రిల్ 15–23: ప్రాక్సీ ఓటు ఫారంల అందుబాటు
ఏప్రిల్ 15–24: ప్రాక్సీ ఓటు హక్కు పత్రాల జారీ
ఏప్రిల్ 26: ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 వరకు పోలింగ్
ఏప్రిల్ 26 సాయంత్రం 5 గంటలకు: ఓట్ల లెక్కింపు & ఫలితాల ప్రకటన
ఏప్రిల్ 27: కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారం
అధికారులు సభ్యులకు పిలుపునిస్తూ, ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.మరోవైపు, గత పాలకుల కార్యవర్గాన్ని పూర్తిగా రద్దు చేసినట్లు స్పష్టం చేశారు. కొత్త నాయకత్వానికి మార్గం సుగమమైందని తెలిపారు.ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సందేహాలు, సూచనలు ఉన్నా సమాజ ఎన్నికల కార్యాలయంలో పనివేళలో సంప్రదించాలని సభ్యులకు సూచించారు.తాండూర్ వీరశైవ సమాజంలో జరుగుతున్న ఈ ఎన్నికలు కేవలం నాయకత్వ మార్పుకే కాదు… సమాజ భవిష్యత్ దిశను నిర్ణయించే కీలక ఘట్టంగా మారనున్నాయి.
తాండూర్ వీరశైవ సమాజంలో ఎన్నికల సందడి ప్రారంభం…. 2026-28 కార్యవర్గానికి ఏప్రిల్ 26న పోలింగ్
తాండూర్ వీరశైవ సమాజంలో ఎన్నికల సందడి ప్రారంభం
- 2026-28 కార్యవర్గానికి ఏప్రిల్ 26న పోలింగ్
- నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రధాన అధికారి బిర్కడ్ నారాయణ
- ఏప్రిల్ 8 నుంచి ఎన్నికల కోడ్ అమలు
-పాత కార్యవర్గం పూర్తిగా రద్దు – కొత్త నాయకత్వానికి రంగం సిద్ధం
తాండూర్ నియోజకవర్గంలో అతి పెద్ద సమాజమైన వీరశైవ సమాజంలో ఎన్నికల వేడి మొదలైంది. 2026-28 సంవత్సరాల కార్యవర్గ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఎన్నికల ప్రధాన అధికారి బిర్కడ్ నారాయణ విడుదల చేశారు.మంగళవారం తాండూర్ పట్టణంలోని వీరశైవ సమాజ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సహాయ ఎన్నికల అధికారులు కొత్తపల్లి ప్రకాష్, కొడ్లి సతీష్ కుమార్, చాట్ల రాజశేఖర్ పాల్గొని నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ....సమాజ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ఏప్రిల్ 8 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 27 వరకు కొనసాగుతుందని వెల్లడించారు.