ఆర్యవైశ్య ఐక్యత కోసం అహర్నిశలు పాటుపడే వ్యక్తిని గెలిపించండి….. సమాజ పెద్దలు కటకం వీరేందర్.

ఆర్యవైశ్య ఐక్యత కోసం అహర్నిశలు పాటుపడే వ్యక్తిని గెలిపించండి.

సమాజ పెద్దలు కటకం వీరేందర్.ఆర్యవైశ్యుల సభ్యుల ఐక్యత కోసం, సమాజ పెద్దలు బలపరిచిన కోట మురళీకృష్ణ ప్యానల్ కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆర్యవైశ్య సమాజం పెద్దలు కటకం వీరేందర్ అన్నారు. ఆర్యవైశ్య సమాజం ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం తాండూర్ పట్టణంలోని ఆదర్శ తులసి నగర్, సాయిపూర్ , మరికంబ కాలనీ తదితర ప్రాంతాలలో ఉన్న ఆర్యవైశ్య సభ్యులను కోట మురళి కృష్ణ ప్యానల్ మరియు సమాజం పెద్దలు కలిసి మురళి కృష్ణ ప్యానల్ కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ క్రమంలో సమాజం పెద్దలు కటకం వీరేందర్ మాట్లాడుతూ.. ఆర్యవైశ్యుల ఐక్యత కోసం పాటుపడే వ్యక్తి కోట మురళీకృష్ణ అని అన్నారు. గత ఎన్నికల్లో పోటీలో ఉన్న కోట మురళీకృష్ణ పెద్దల మాట విని పోటి నుంచి తప్పకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆర్యవైశ్యులు అందరు సమానమే అని తనకు ఎవరిపై కోపం లేదని ఆర్యవైశ్యులు ఐక్యతగా ఉండి ఏకగ్రీవ ఎన్నిక కావలసిన ఈ తరుణంలో ఎన్నికలు జరగడం బాధాకరంగా ఉందని అన్నారు. అయినా కూడా సమాజ సేవలో ముందుండే కోట మురళీకృష్ణను ఆర్యవైశ్యులు ఐక్యత కోసం పాటుపడే వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తి యొక్క ప్యానల్ అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులుగా పోటీ చేయనున్న గుబ్బ యాదయ్య, ప్రధాన కార్యదర్శిగా కోట్రికా కిరణ్ కుమార్, సహాయ కార్యదర్శిగా పోలా వేణుగోపాల్, కోశాధికారిగా ఆడికిచర్ల సంజీవ్ కుమార్ మరియు సమాజం సభ్యులు పెద్దలు తదితరులున్నారు

🗓 12 Mar 2026 | 09:56 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top