సైబర్ సెక్యూరిటీ’పై అవగాహన
వికారాబాద్:విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీలో ‘ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీ, ప్రముఖ ఐటీ శిక్షణా సంస్థ ‘టెక్స్ అకాడమీ’ సంయుక్త భాగస్వామ్యంతో ‘సైబర్ సెక్యూరిటీ’ అనే అంశంపై ప్రతిష్టాత్మక ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (FDP) మంగళవారం ఘనంగా ప్రారంభమైంది.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. జి. దుర్గాసుకుమార్ గారు మాట్లాడుతూ… వారం రోజుల పాటు నిర్వహించనున్న ఈ “సైబర్ సెక్యూరిటీ అవగాహన సదస్సు”
అధ్యాపకుల బోధనా నైపుణ్యాలు, పరిశోధనా సామర్థ్యాలు మరియు వృత్తిపరమైన విజ్ఞానాన్ని పెంపొందించడానికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ శిక్షణ విద్యార్థుల ఉద్యోగ ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించడానికి కూడా సహాయపడుతుందని పేర్కొన్నారు. కళాశాల సీఈఓ శ్రావణ్ మాట్లాడుతూ… నేటి డిజిటల్ యుగంలో రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాల నియంత్రణ, భద్రతా ప్రమాణాలపై అధ్యాపకులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకే ఈ ప్రత్యేక ఎఫ్డీపీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.కంప్యూటర్ సైన్స్ విభాగం డీన్ డాక్టర్ రాజా విక్రమ్ మాట్లాడుతూ…అధ్యాపకులకు సరికొత్త సైబర్ సెక్యూరిటీ టూల్స్‌పై శిక్షణ ఇవ్వడం ద్వారా ఇంజనీరింగ్, ఐటీ విభాగాల ఫ్యాకల్టీ సాంకేతిక నైపుణ్యాలు మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.టెక్స్ అకాడమీ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ మేనేజర్ మోహన్ దాస్ మాట్లాడుతూ… ఈ శిక్షణలో ఇంజనీరింగ్, ఐటీ విభాగాల అధ్యాపకులు నేర్చుకున్న సరికొత్త అంశాలను విద్యార్థులకు బోధించి, వారిని భవిష్యత్తు సైబర్ నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ఈ ప్రోగ్రామ్ ఒక వంతెనలా పనిచేస్తుందని అన్నారు.
సైబర్ సెక్యూరిటీ నిపుణుడు మరియు శిక్షకుడు శశిధర్ మాట్లాడుతూ… ఈ వారం రోజుల శిక్షణలో భాగంగా నెట్వర్క్ సెక్యూరిటీ, క్రిప్టోగ్రఫీ, క్లౌడ్ సెక్యూరిటీ, వెబ్ అప్లికేషన్ భద్రత, డిజిటల్ ఫోరెన్సిక్స్ మరియు సైబర్ చట్టాలు-కేస్ స్టడీస్‌పై అధ్యాపకులకు ప్రాక్టికల్ అవగాహన కల్పిస్తామని వివరించారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీకి చెందిన వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు మరియు టెక్స్ అకాడమీ ప్రతినిధులు రంజిత్ కుమార్, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సైబర్ సెక్యూరిటీ’పై అవగాహన
సైబర్ సెక్యూరిటీ’పై అవగాహన
వికారాబాద్:విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీలో ‘ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీ, ప్రముఖ ఐటీ శిక్షణా సంస్థ 'టెక్స్ అకాడమీ' సంయుక్త భాగస్వామ్యంతో ‘సైబర్ సెక్యూరిటీ’ అనే అంశంపై ప్రతిష్టాత్మక ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (FDP) మంగళవారం ఘనంగా ప్రారంభమైంది.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. జి. దుర్గాసుకుమార్ గారు మాట్లాడుతూ... వారం రోజుల పాటు నిర్వహించనున్న ఈ "సైబర్ సెక్యూరిటీ అవగాహన సదస్సు"
అధ్యాపకుల బోధనా నైపుణ్యాలు, పరిశోధనా సామర్థ్యాలు మరియు వృత్తిపరమైన విజ్ఞానాన్ని పెంపొందించడానికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ శిక్షణ విద్యార్థుల ఉద్యోగ ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించడానికి కూడా సహాయపడుతుందని పేర్కొన్నారు. కళాశాల సీఈఓ శ్రావణ్ మాట్లాడుతూ... నేటి డిజిటల్ యుగంలో రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాల నియంత్రణ, భద్రతా ప్రమాణాలపై అధ్యాపకులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకే ఈ ప్రత్యేక ఎఫ్డీపీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.కంప్యూటర్ సైన్స్ విభాగం డీన్ డాక్టర్ రాజా విక్రమ్ మాట్లాడుతూ...అధ్యాపకులకు సరికొత్త సైబర్ సెక్యూరిటీ టూల్స్‌పై శిక్షణ ఇవ్వడం ద్వారా ఇంజనీరింగ్, ఐటీ విభాగాల ఫ్యాకల్టీ సాంకేతిక నైపుణ్యాలు మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.టెక్స్ అకాడమీ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ మేనేజర్ మోహన్ దాస్ మాట్లాడుతూ... ఈ శిక్షణలో ఇంజనీరింగ్, ఐటీ విభాగాల అధ్యాపకులు నేర్చుకున్న సరికొత్త అంశాలను విద్యార్థులకు బోధించి, వారిని భవిష్యత్తు సైబర్ నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ఈ ప్రోగ్రామ్ ఒక వంతెనలా పనిచేస్తుందని అన్నారు.
సైబర్ సెక్యూరిటీ నిపుణుడు మరియు శిక్షకుడు శశిధర్ మాట్లాడుతూ... ఈ వారం రోజుల శిక్షణలో భాగంగా నెట్వర్క్ సెక్యూరిటీ, క్రిప్టోగ్రఫీ, క్లౌడ్ సెక్యూరిటీ, వెబ్ అప్లికేషన్ భద్రత, డిజిటల్ ఫోరెన్సిక్స్ మరియు సైబర్ చట్టాలు-కేస్ స్టడీస్‌పై అధ్యాపకులకు ప్రాక్టికల్ అవగాహన కల్పిస్తామని వివరించారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీకి చెందిన వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు మరియు టెక్స్ అకాడమీ ప్రతినిధులు రంజిత్ కుమార్, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
