యాలాల పోలీసు స్టేషన్ పనితీరుపై ఎస్పీ స్నేహ మెహ్రా ప్రశంసలు
సాధారణ తనిఖీల్లో భాగంగా యాలాల పోలీస్ స్టేషన్ను సందర్శించిన జిల్లా ఎస్పీ
ఎస్సై విఠల్ రెడ్డి సేవలకు ప్రత్యేక అభినందనలు
ఇదే స్ఫూర్తితో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచన
యాలాల, జూన్ 12: వికారాబాద్ జిల్లా యాలాల పోలీసు స్టేషన్ సిబ్బంది పనితీరును జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ప్రశంసించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా శుక్రవారం యాలాల పోలీసు స్టేషన్ను సందర్శించిన ఆమె స్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డులను తనిఖీ చేసి వాటి నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్న ఎస్పీ, వారి సేవలను అభినందించారు. ముఖ్యంగా యాలాల ఎస్సై విఠల్ రెడ్డి పనితీరు ప్రశంసనీయంగా ఉందని పేర్కొంటూ ప్రత్యేకంగా అభినందించారు.
పోలీసు సిబ్బంది ఇదే విధంగా క్రమశిక్షణతో, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ సూచించారు. ప్రజల్లో పోలీసు శాఖపై విశ్వాసాన్ని పెంపొందించేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె పేర్కొన్నారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో తాండూర్ డీఎస్పీ నర్సింగ్ యాదయ్య పాల్గొన్నారు. అలాగే యాలాల పోలీసు స్టేషన్ ఏఎస్సై రాంచందర్, హెడ్ కానిస్టేబుల్ నర్సిములు, సిబ్బంది మున్నయ్య, శ్రీనివాస్ గౌడ్, హన్మంతు, మహేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, వినయ్, జగదీష్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.