గ్రామాభివృద్ధితోనే దేశ అభివృద్ధి..ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి
-పీఎం శ్రీ పాఠశాలలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కొండా
-కొండ మాధవరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో పాఠశాల టాయిలెట్లను స్వయంగా శుభ్రం చేసిన ఎంపీ
-విద్యార్థులు పరిశుభ్రతను అలవాటు చేసుకోవాలి : కొండా
-చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశాభివృద్ధి జరుగుతుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.సోమవారం వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొని, కొండ మాధవరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో పాఠశాలలోని టాయిలెట్లను స్వయంగా శుభ్రం చేశారు.
అనంతరం పాఠశాల సిబ్బందితో విద్యార్థుల విద్యా పరిస్థితులు, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు.
ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన తాగునీటి బోరును ప్రారంభించిన ఆయన, వేసవి శిబిరాల్లో విద్యార్థులు తయారు చేసిన పలు వస్తువులను పరిశీలించి అభినందించారు.అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, భారతదేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, ఆ యువతను తీర్చిదిద్దే బాధ్యత విద్యాసంస్థలపై ఉందన్నారు. విద్యార్థులు విద్యతో పాటు పరిశుభ్రతను కూడా అలవాటు చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు. రమేష్ కుమార్, రాష్ట్ర మహిళా సమైక్య సభ్యులు సాహూ శ్రీలత, రాష్ట్ర నాయకులు ప్రహ్లాద్ రావు, కౌన్సిలర్లు నాగారం మల్లేశం, శ్రీకాంత్ రెడ్డి, కిరణ్, బీజేపీ సీనియర్ నాయకులు మనోహర్ రావు, పటేల్ విజయ్ కుమార్, బంటారం భద్రేశ్వర్, కృష్ణ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామాభివృద్ధితోనే దేశ అభివృద్ధి..ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి
గ్రామాభివృద్ధితోనే దేశ అభివృద్ధి..ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి
-పీఎం శ్రీ పాఠశాలలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కొండా
-కొండ మాధవరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో పాఠశాల టాయిలెట్లను స్వయంగా శుభ్రం చేసిన ఎంపీ
-విద్యార్థులు పరిశుభ్రతను అలవాటు చేసుకోవాలి : కొండా
-చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిగ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశాభివృద్ధి జరుగుతుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.సోమవారం వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొని, కొండ మాధవరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో పాఠశాలలోని టాయిలెట్లను స్వయంగా శుభ్రం చేశారు. అనంతరం పాఠశాల సిబ్బందితో విద్యార్థుల విద్యా పరిస్థితులు, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు.