నీటి కష్టాలకు చెక్.. 33వ వార్డులో కొత్త బోరుతో ఊపిరి పీల్చుకున్న ప్రజలు
ఉదయం మొదలైన బోరు తవ్వకం రాత్రికి సక్సెస్.. రెండు అంగుళాల నీరు రావడంతో కాలనీవాసుల ఆనందం
ప్రజల కోసం పట్టుదలతో ముందడుగు.. నాలుగు బోర్లు వేయించి నీటి సమస్యపై పోరాడిన కౌన్శ్రీసిలర్ కాంత్ రెడ్డి
సహకరించిన చైర్పర్సన్ నీరజ బాల్రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి కృతజ్ఞతలు
నీటి సమస్యను పరిష్కరించిన 33వ వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్ రెడ్డి
తాండూర్ మున్సిపల్ పరిధిలోని 33వ వార్డు గాంధీచౌక్ ప్రాంతంలో గత కొన్ని నెలలుగా నెలకొన్న తీవ్ర తాగునీటి సమస్యకు స్థానిక కౌన్సిలర్ శ్రీకాంత్ రెడ్డి కృషితో కొంతవరకు పరిష్కారం లభించింది. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుంచి వార్డులోని ప్రజలు ఎదుర్కొంటున్న నీటి ఇబ్బందులను తొలగించేందుకు ఆయన నిరంతరం ప్రయత్నాలు కొనసాగించారు.
సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఇప్పటికే కాలనీలో నాలుగు బోర్లు వేయించినప్పటికీ ఆశించిన ఫలితం రాలేదు. అయినప్పటికీ వెనుకడుగు వేయకుండా మరోసారి ప్రత్యేక చర్యలు చేపట్టిన శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన బోరు తవ్వకం రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. చివరకు సుమారు రెండు అంగుళాల మేర నీటి ప్రవాహం లభించడంతో కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేశారు.
నీటి సమస్య కొంతవరకు పరిష్కారం కావడంతో స్థానిక ప్రజలు కౌన్సిలర్ శ్రీకాంత్ రెడ్డిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ వార్డులో నీటి సమస్య పరిష్కారానికి సహకరించిన తాండూర్ మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాల్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని, వార్డులో మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని కౌన్సిలర్ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు