కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యం.. రైతులకు తప్పని నిరీక్షణ

అధికారుల నిర్లక్ష్యంతో వర్షానికి తడిసిన ధాన్యం బస్తాలు

నెలలు గడిచిన కొనుగోలు చేయని పరిస్థితి

పొలాల చదును పనులు ప్రారంభించాల్సిన సమయంలో కూడా పరిస్థితి మారలేదు.

ఇంకెప్పుడు ధాన్యం తరలిస్తారు?” అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న అన్నదాతలు

యాలాల మండలంలోని బెన్నూర్ కేంద్రాల్లో దయనీయ పరిస్థితివికారాబాద్ జిల్లా యాలాల మండలంలో వరి కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం ఇంకా తరలించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం రాత్రి కురిసిన వర్షానికి యాలాల మండల కేంద్రంలోని కాగ్నా జలాల ఎఫ్‌పీఓ వరి కొనుగోలు కేంద్రంతో పాటు బెన్నూర్ వరి కొనుగోలు కేంద్రంలో నిల్వ చేసిన వరి ధాన్యం బస్తాలు తడిసిపోయాయి.
పంటను ఎంతో శ్రమించి పండించిన రైతులు ధాన్యం నాణ్యత దెబ్బతినకుండా కాపాడుకునేందుకు రాత్రంతా ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం పేరుకుపోయి రోజులు గడుస్తున్నా సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో కొత్త సాగుకు పొలాలను చదును చేసుకునే సమయం ఆసన్నమైందని, అయితే ధాన్యం ఇంకా కేంద్రాల్లోనే ఉండటంతో తదుపరి వ్యవసాయ పనులు ఆలస్యమవుతున్నాయని రైతులు వాపోతున్నారు.
“మరికొన్ని రోజులు ఇలాగే కేంద్రాల వద్దే వేచి చూడాలా? ఇంకెప్పుడు ధాన్యాన్ని తరలిస్తారు?” అంటూ రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తడిసిన ధాన్యానికి నష్టం కలగకుండా వెంటనే బస్తాలను తరలించి రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, కేంద్రాల్లో నిల్వ ఉన్న బస్తాలను అత్యవసరంగా తరలించాలని రైతులు కోరుతున్నారు.

కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యం.. రైతులకు తప్పని నిరీక్షణ

కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యం.. రైతులకు తప్పని నిరీక్షణ

అధికారుల నిర్లక్ష్యంతో వర్షానికి తడిసిన ధాన్యం బస్తాలు

నెలలు గడిచిన కొనుగోలు చేయని పరిస్థితి

పొలాల చదును పనులు ప్రారంభించాల్సిన సమయంలో కూడా పరిస్థితి మారలేదు.

ఇంకెప్పుడు ధాన్యం తరలిస్తారు?" అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న అన్నదాతలు

యాలాల మండలంలోని బెన్నూర్ కేంద్రాల్లో దయనీయ పరిస్థితివికారాబాద్ జిల్లా యాలాల మండలంలో వరి కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం ఇంకా తరలించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం రాత్రి కురిసిన వర్షానికి యాలాల మండల కేంద్రంలోని కాగ్నా జలాల ఎఫ్‌పీఓ వరి కొనుగోలు కేంద్రంతో పాటు బెన్నూర్ వరి కొనుగోలు కేంద్రంలో నిల్వ చేసిన వరి ధాన్యం బస్తాలు తడిసిపోయాయి.
పంటను ఎంతో శ్రమించి పండించిన రైతులు ధాన్యం నాణ్యత దెబ్బతినకుండా కాపాడుకునేందుకు రాత్రంతా ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం పేరుకుపోయి రోజులు గడుస్తున్నా సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో కొత్త సాగుకు పొలాలను చదును చేసుకునే సమయం ఆసన్నమైందని, అయితే ధాన్యం ఇంకా కేంద్రాల్లోనే ఉండటంతో తదుపరి వ్యవసాయ పనులు ఆలస్యమవుతున్నాయని రైతులు వాపోతున్నారు.
"మరికొన్ని రోజులు ఇలాగే కేంద్రాల వద్దే వేచి చూడాలా? ఇంకెప్పుడు ధాన్యాన్ని తరలిస్తారు?" అంటూ రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తడిసిన ధాన్యానికి నష్టం కలగకుండా వెంటనే బస్తాలను తరలించి రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, కేంద్రాల్లో నిల్వ ఉన్న బస్తాలను అత్యవసరంగా తరలించాలని రైతులు కోరుతున్నారు.

🗓 14 Jun 2026 | 12:54 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top