రేషన్ బియ్యం సక్రమ పంపిణీకి ప్రాధాన్యం ఇవ్వాలి: తహసీల్దార్ గాయత్రి
యాలాల నూతన తహసీల్దార్‌కు రేషన్ డీలర్ల ఘన సన్మానం
యాలాల, జూన్ 12: వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు సక్రమంగా, సమయానుకూలంగా పంపిణీ చేయాలని యాలాల తహసీల్దార్ గాయత్రి సూచించారు. ఇటీవల బదిలీపై యాలాల మండలానికి వచ్చిన నూతన తహసీల్దార్ గాయత్రిని శుక్రవారం మండలంలోని రేషన్ డీలర్లు కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు.
అదే సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ కిరణ్ కుమార్‌ను కూడా రేషన్ డీలర్లు శాలువాతో సన్మానించారు. అనంతరం మాట్లాడిన తహసీల్దార్ గాయత్రి, ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం పంపిణీలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా ప్రతి డీలర్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్ణీత సమయానికి బియ్యాన్ని అందించాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ఆమె రేషన్ డీలర్లకు సూచించారు.ఈ కార్యక్రమంలో యాలాల మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు నాగిరెడ్డి, ఉపాధ్యక్షులు పెంట్యానాయక్‌తో పాటు మండలంలోని పలువురు రేషన్ డీలర్లు పాల్గొన్నారు.