క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన సర్పంచ్

-జిపికె భాను ప్రసాద్ క్రికెట్ మెమోరియల్ టోర్నమెంట్ కు మంచి స్పందన
విజేతగా నిలిచిన ఎ 11 జట్టు
-పదివేల నగదు బహుమతిని అందజేసిన నిర్వాకులు
-క్రీడాలు మానసికోల్లాసాన్ని పెంచుతాయి
-గ్రామ సర్పంచ్ సుదర్శన్ రెడ్డి

తాండూరు జనవరి 25, ..వికారాబాద్ జిల్లా తాండూరు మండలం చంద్ర వంచ గ్రామానికి చెందిన గడ్డమిడి పెద్దకుర్వ భాను ప్రసాద్ గత కొంతకాలం క్రితం మృతి చెందారు. దీంతో మృతుడి సోదరుడు గడ్డ మీది పెద్ద కుర్వ శివకుమార్ తన తమ్ముడి జ్ఞాపకార్థం క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించాలనే లక్ష్యంతో గడ్డమీది పెద్ద కుర్వ భాను ప్రసాద్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. దీంతో ఆదివారం రోజు గ్రామ సర్పంచు పి సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఎంతో ఉత్సాహంతో ఉత్కంఠ భరితంగా కొనసాగిన క్రికెట్ టోర్నమెంటులో ఈగల్ జట్టు రన్నర్ జట్టుగా నిలిచింది. విన్నర్ జట్టు గా నిలిచిన ఎ 11 జట్టు కు రూ 10 వేల నగదు బహుమతి ట్రోపిని అందజేశారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేయడం కోసం గడ్డమీది పెద్ద కురువ శివకుమార్ తన తోటి స్నేహితుల సమక్షంలో ఎ 11 విన్నర్ జట్టుకు రూ 10వేల నగదు బహుమతి, రన్నర్ జట్టుకు రూ 5 వేల నగదు బహుమతి అందజేసినట్లు చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
చంద్రవంచ గ్రామ శివారులోని ఓ మైదానంలో నిర్వహించిన గడ్డమిడి పెద్దకుర్వ భాను ప్రసాద్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్‌లో
అద్భుతమైన ఆటతీరుతో విజయం సాధించిన ఎ 11 జట్టుకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు.

అలాగే క్రీడలలో గెలుపు ఓటములు సహజమేనని ఎవరు గెలిచినా ఓడిన స్నేహపూరితంగా ఉండాలని సూచించారు. గెలుపొందిన జట్టు మరింత బాధ్యతతో ముందుకు వెళుతుందని గుర్తు చేశారు. ఓటమి చెందిన జట్లు మరింత అనుభవంతో ముందుకు వెళ్లాల్సిన అవకాశం ఉంటుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ క్రీడాకారులు, స్థానిక యువకులు అభిమానులు గ్రామస్తులు ఉన్నారు.

క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన సర్పంచ్

క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన సర్పంచ్
-జిపికె భాను ప్రసాద్ క్రికెట్ మెమోరియల్ టోర్నమెంట్ కు మంచి స్పందన
-విజేతగా నిలిచిన ఎ 11 జట్టు
-పదివేల నగదు బహుమతిని అందజేసిన నిర్వాకులు
-క్రీడాలు మానసికోల్లాసాన్ని పెంచుతాయి
-గ్రామ సర్పంచ్ సుదర్శన్ రెడ్డి

తాండూరు జనవరి 25, ..వికారాబాద్ జిల్లా తాండూరు మండలం చంద్ర వంచ గ్రామానికి చెందిన గడ్డమిడి పెద్దకుర్వ భాను ప్రసాద్ గత కొంతకాలం క్రితం మృతి చెందారు. దీంతో మృతుడి సోదరుడు గడ్డ మీది పెద్ద కుర్వ శివకుమార్ తన తమ్ముడి జ్ఞాపకార్థం క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించాలనే లక్ష్యంతో గడ్డమీది పెద్ద కుర్వ భాను ప్రసాద్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. దీంతో ఆదివారం రోజు గ్రామ సర్పంచు పి సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఎంతో ఉత్సాహంతో ఉత్కంఠ భరితంగా కొనసాగిన క్రికెట్ టోర్నమెంటులో ఈగల్ జట్టు రన్నర్ జట్టుగా నిలిచింది. విన్నర్ జట్టు గా నిలిచిన ఎ 11 జట్టు కు రూ 10 వేల నగదు బహుమతి ట్రోపిని అందజేశారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేయడం కోసం గడ్డమీది పెద్ద కురువ శివకుమార్ తన తోటి స్నేహితుల సమక్షంలో ఎ 11 విన్నర్ జట్టుకు రూ 10వేల నగదు బహుమతి, రన్నర్ జట్టుకు రూ 5 వేల నగదు బహుమతి అందజేసినట్లు చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
చంద్రవంచ గ్రామ శివారులోని ఓ మైదానంలో నిర్వహించిన గడ్డమిడి పెద్దకుర్వ భాను ప్రసాద్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్‌లో
అద్భుతమైన ఆటతీరుతో విజయం సాధించిన ఎ 11 జట్టుకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు.

అలాగే క్రీడలలో గెలుపు ఓటములు సహజమేనని ఎవరు గెలిచినా ఓడిన స్నేహపూరితంగా ఉండాలని సూచించారు. గెలుపొందిన జట్టు మరింత బాధ్యతతో ముందుకు వెళుతుందని గుర్తు చేశారు. ఓటమి చెందిన జట్లు మరింత అనుభవంతో ముందుకు వెళ్లాల్సిన అవకాశం ఉంటుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ క్రీడాకారులు, స్థానిక యువకులు అభిమానులు గ్రామస్తులు ఉన్నారు.

🗓 25 Jan 2026 | 09:36 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top