భక్తి పారవశ్యంలో మహా పడిపూజ మహోత్సవం
అంగరంగ వైభవంగా ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలు నిర్వహించిన దాత కోట్రిక రజిని నాగరాజ్, కోట్రిక సరిత కిరణ్ కుమార్
పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ప్రజా పతినిధులు
ప్రజలతో కిక్కిరిసిన హనుమాన్ దేవాలయం
తాండూరు పట్టణంలో శ్రీ హనుమాన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. గురువారం కన్య పాఠశాల సమీపంలోని హనుమాన్ దేవాలయంలో భక్తి శ్రద్ధల మధ్య హనుమాన్ మహా పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగాజరిగింది.
ఈ సందర్భంగాదేవాలయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలు నిర్వహించగా, మహా పడిపూజ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి పూజల్లో పాల్గొని భక్తి పారవశ్యంలో మునిగి తేలారు.
ఆలయం అంతా భజనలు, ఆటపాటలతో మార్మోగింది.ఈ కార్యక్రమానికి దాతలు కోట్రిక రజిని నాగరాజ్, కోట్రిక సరిత కిరణ్ కుమార్ విశేష సహకారం అందించారు. వారి సహకారంతో పూజా కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరిగాయి.ఈ వేడుకల్లో తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొని స్వయంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే స్థానిక కౌన్సిలర్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ లింగదలి రవికుమార్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ సునీత సంపత్ మరియు పలు సంఘాల ప్రతినిధులు పాల్గొని భక్తి భావంతో పూజలు చేశారు.మొత్తంగా హనుమాన్ జన్మోత్సవ వేడుకలు తాండూరులో భక్తుల హృదయాలను హత్తుకునేలా అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి.ఈ వేడుకలలో వినోద్ కుమార్, జై శ్రీ రామా అశోక్, పురోహితులు తదితరులు ఉన్నారు
భక్తి పారవశ్యంలో మహా పడిపూజ మహోత్సవం
భక్తి పారవశ్యంలో మహా పడిపూజ మహోత్సవం
అంగరంగ వైభవంగా ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలు నిర్వహించిన దాత కోట్రిక రజిని నాగరాజ్, కోట్రిక సరిత కిరణ్ కుమార్
పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ప్రజా పతినిధులు
ప్రజలతో కిక్కిరిసిన హనుమాన్ దేవాలయం
తాండూరు పట్టణంలో శ్రీ హనుమాన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. గురువారం కన్య పాఠశాల సమీపంలోని హనుమాన్ దేవాలయంలో భక్తి శ్రద్ధల మధ్య హనుమాన్ మహా పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగాజరిగింది.
ఈ సందర్భంగాదేవాలయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలు నిర్వహించగా, మహా పడిపూజ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి పూజల్లో పాల్గొని భక్తి పారవశ్యంలో మునిగి తేలారు.ఆలయం అంతా భజనలు, ఆటపాటలతో మార్మోగింది.ఈ కార్యక్రమానికి దాతలు కోట్రిక రజిని నాగరాజ్, కోట్రిక సరిత కిరణ్ కుమార్ విశేష సహకారం అందించారు. వారి సహకారంతో పూజా కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరిగాయి.ఈ వేడుకల్లో తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొని స్వయంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే స్థానిక కౌన్సిలర్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ లింగదలి రవికుమార్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ సునీత సంపత్ మరియు పలు సంఘాల ప్రతినిధులు పాల్గొని భక్తి భావంతో పూజలు చేశారు.మొత్తంగా హనుమాన్ జన్మోత్సవ వేడుకలు తాండూరులో భక్తుల హృదయాలను హత్తుకునేలా అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి.ఈ వేడుకలలో వినోద్ కుమార్, జై శ్రీ రామా అశోక్, పురోహితులు తదితరులు ఉన్నారు
