అక్కమహాదేవి జయంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం కు విశేష స్పందన

వీరశైవ అక్కమాదేవి మహిళా కమిటీ సేవా కార్యక్రమానికి ప్రజల ఆదరణ

80 మందికి ఉచిత వైద్య సేవలు, మందుల పంపిణీ

సమాజం లో మరిన్ని సేవలు అందిస్తాం

అక్క మాదేవి మహిళ కమిటీ, వీర శైవ మహిళ సమాజం ప్రదినిధులు

వికారాబాద్ జిల్లా తాడూరు పట్టణంలో వీరశైవ అక్కమాదేవి మహిళా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. గురువారం అక్కమహాదేవి జయంతి సందర్భంగా పట్టణంలోని శ్రీ బాగివి భద్రేశ్వర దేవాలయంలో ఈ వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ శిబిరాన్ని వీరశైవ అక్కమాదేవి మహిళా కమిటీ మరియు వీరశైవ మహిళ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ప్రముఖ వైద్యురాలు డాక్టర్ అనూష వినోద్ సేవలందించగా, మొత్తం 80 మంది రోగులు ఉచిత వైద్య సేవలను పొందారు. రోగులకు అవసరమైన మందులను కూడా ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ అనూష వినోద్ మాట్లాడుతూ.. సమాజంలో సేవ చేయాలనే లక్ష్యంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, అవసరమైన వారికి వైద్య సేవలు అందించడం తమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.మరోవైపు మహిళా సంఘం ప్రతినిధులు జోల్లు రోహిణి, కోర్వార్ అంజలి
మాట్లాడుతూ… అక్కమహాదేవి జయంతిని పురస్కరించుకుని సేవా కార్యక్రమం నిర్వహించడం గర్వంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ శిబిరంలో అనుకున్న దానికంటే ఎక్కువ మంది మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు పాల్గొని వైద్య సేవలు పొందినట్లు వెల్లడించారు.ఇలాంటి సేవా కార్యక్రమాలను రానున్న రోజుల్లో మరింత విస్తరించి కొనసాగిస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలోసంఘంగౌరవ అధ్యక్షురాలు మల్లమ్మ, లక్ష్మి, సింధు, అక్షర, ఎడ్రం శ్రీదేవి మరియు
స్థానిక మహిళా సభ్యులు, సంఘ ప్రతినిధులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అక్కమహాదేవి జయంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం కు విశేష స్పందన

అక్కమహాదేవి జయంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం కు విశేష స్పందన

వీరశైవ అక్కమాదేవి మహిళా కమిటీ సేవా కార్యక్రమానికి ప్రజల ఆదరణ

80 మందికి ఉచిత వైద్య సేవలు, మందుల పంపిణీ

సమాజం లో మరిన్ని సేవలు అందిస్తాం

అక్క మాదేవి మహిళ కమిటీ, వీర శైవ మహిళ సమాజం ప్రదినిధులు

వికారాబాద్ జిల్లా తాడూరు పట్టణంలో వీరశైవ అక్కమాదేవి మహిళా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. గురువారం అక్కమహాదేవి జయంతి సందర్భంగా పట్టణంలోని శ్రీ బాగివి భద్రేశ్వర దేవాలయంలో ఈ వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ శిబిరాన్ని వీరశైవ అక్కమాదేవి మహిళా కమిటీ మరియు వీరశైవ మహిళ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ప్రముఖ వైద్యురాలు డాక్టర్ అనూష వినోద్ సేవలందించగా, మొత్తం 80 మంది రోగులు ఉచిత వైద్య సేవలను పొందారు. రోగులకు అవసరమైన మందులను కూడా ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ అనూష వినోద్ మాట్లాడుతూ.. సమాజంలో సేవ చేయాలనే లక్ష్యంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, అవసరమైన వారికి వైద్య సేవలు అందించడం తమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.మరోవైపు మహిళా సంఘం ప్రతినిధులు జోల్లు రోహిణి, కోర్వార్ అంజలి
మాట్లాడుతూ... అక్కమహాదేవి జయంతిని పురస్కరించుకుని సేవా కార్యక్రమం నిర్వహించడం గర్వంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ శిబిరంలో అనుకున్న దానికంటే ఎక్కువ మంది మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు పాల్గొని వైద్య సేవలు పొందినట్లు వెల్లడించారు.ఇలాంటి సేవా కార్యక్రమాలను రానున్న రోజుల్లో మరింత విస్తరించి కొనసాగిస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలోసంఘంగౌరవ అధ్యక్షురాలు మల్లమ్మ, లక్ష్మి, సింధు, అక్షర, ఎడ్రం శ్రీదేవి మరియు
స్థానిక మహిళా సభ్యులు, సంఘ ప్రతినిధులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🗓 02 Apr 2026 | 07:32 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top