*వి బి జి రామ్ జి చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి*

*యాలాల గ్రామ సర్పంచ్ కు మెమోరాండం ఇచ్చిన – వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు బుగ్గప్ప*

*యాలాల..* వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని యాలాల గ్రామంలో గ్రామ సర్పంచ్ శివయ్య కు వి. బి. జి. రామ్ చట్టాన్ని రద్దు చేయాలని జిల్లా వ్యవసాయ సంఘం అధ్యక్షులు యు.బుగ్గప్ప ఆధ్వర్యంలో మహాత్మా గాంధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పునరుద్ధరించాలని గురువారం మండల కేంద్రం లో జరిగిన గ్రామ సభలో మెమోరాండం సమర్పించారు. గ్రామ ప్రజలు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సందర్భంగా వారి దృష్టికి తీసుకెళ్లారు.ఈ మెమోరాండంపై గ్రామ పంచాయతీ సభ్యులతో చర్చించి తీర్మానం ఆమోదించి ప్రభుత్వానికి పంపించాలని . కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విబిజీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలని, బదులుగా గ్రామీణ పేదల జీవనోపాధికి తోడ్పడే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
గ్రామీణ కార్మికులకు ఉపాధి హామీ కల్పించడం, వలసలను అరికట్టడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ఉపాధి హామీ చట్టం అత్యంత అవసరమని నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజల డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.

*వి బి జి రామ్ జి చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి*

*వి బి జి రామ్ జి చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి*

*యాలాల గ్రామ సర్పంచ్ కు మెమోరాండం ఇచ్చిన - వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు బుగ్గప్ప*

*యాలాల..* వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని యాలాల గ్రామంలో గ్రామ సర్పంచ్ శివయ్య కు వి. బి. జి. రామ్ చట్టాన్ని రద్దు చేయాలని జిల్లా వ్యవసాయ సంఘం అధ్యక్షులు యు.బుగ్గప్ప ఆధ్వర్యంలో మహాత్మా గాంధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పునరుద్ధరించాలని గురువారం మండల కేంద్రం లో జరిగిన గ్రామ సభలో మెమోరాండం సమర్పించారు. గ్రామ ప్రజలు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సందర్భంగా వారి దృష్టికి తీసుకెళ్లారు.ఈ మెమోరాండంపై గ్రామ పంచాయతీ సభ్యులతో చర్చించి తీర్మానం ఆమోదించి ప్రభుత్వానికి పంపించాలని . కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విబిజీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలని, బదులుగా గ్రామీణ పేదల జీవనోపాధికి తోడ్పడే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
గ్రామీణ కార్మికులకు ఉపాధి హామీ కల్పించడం, వలసలను అరికట్టడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ఉపాధి హామీ చట్టం అత్యంత అవసరమని నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజల డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.

🗓 02 Apr 2026 | 06:24 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top