చికెన్, మటన్, ఫిష్ వ్యర్థాల సేకరణ టెండర్‌కు భారీ పోటీ

తాండూర్ మున్సిపల్ కార్యాలయంలో బహిరంగ వేలం పాట

రూ.20 లక్షలకు సొంతం చేసుకున్న ఎండి హమీద్

స్లాటర్ హౌస్ వేలంలో ఎండి మజీద్ సొంతం

నిబంధనలు పాటించకపోతే టెండర్ రద్దు – కమిషనర్ మధుసూదన్ రెడ్డి

తాండూరు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో
మంగళవారం చికెన్, మటన్, ఫిష్ వ్యర్థాల సేకరణ మరియు రవాణాకు సంబంధించిన టెండర్‌ల కోసం బహిరంగ వేలం పాటను మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ, కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేలం పాటకు స్థానిక వ్యాపారుల నుండి మంచి స్పందన లభించింది.చికెన్, మటన్ మరియు ఫిష్ వ్యర్థాల సేకరణ టెండర్‌కు పోటీదారులనుంచి గట్టి పోటీ నెలకొంది. ఈ టెండర్‌లో తాండూర్‌కు చెందిన ఎండి హమీద్ అత్యధికంగా రూ.20 లక్షలకు పాట పాడి టెండర్‌ను దక్కించుకున్నారు. పోటీలో పాల్గొన్న అబ్దుల్ రహీం రూ.17 లక్షల 7 వేల వరకు పాట పాడగా, చివరికి ఎండి హమీద్ అత్యధికంగా రూ.20 వేల అదనంగా పాట పాడి టెండర్‌ను సొంతం చేసుకున్నారు.ఎజాజ్ కూడా పోటీలో పాల్గొన్న దక్కించుకోలేరు.

అదేవిధంగాస్లాటర్ హౌస్‌కు సంబంధించిన మరో బహిరంగ వేలం పాటలో ఎండి మజీద్ మరియు ఖురేషీలు వేలం పాటలో పాల్గొన్నారు. ఇందులో ఎండి మజీద్ రూ.64 వేలుకు అత్యధికంగా పాట పాడి టెండర్‌ను దక్కించుకున్నారు.ఈ సందర్భంగా కమిషనర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, టెండర్ గెలుచుకున్న వారు నిబంధనల ప్రకారం పనిచేయాలని సూచించారు. నిబంధనలు పాటించని పక్షంలో టెండర్లను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఈ టెండర్ గడువు 31 మార్చి 2027 వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. అలాగే టెండర్ గెలుపొందిన వారు ఏడు పని దినాలలో టెండర్ మొత్తాన్ని మున్సిపాలిటీకి జమ చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, మేనేజర్ నరేందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ జి. రాములు, పలువురు కౌన్సిలర్లు మరియు అధికారులు పాల్గొన్నారు.

🗓 07 Apr 2026 | 03:27 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top