సర్వే నంబర్ 111లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంపై బీఆర్ఎస్ ఆగ్రహం

12 మంది కౌన్సిలర్ల సంతకాలతో అధికారులకు ఫిర్యాదు
కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారంటూ ఆరోపణలు
వెంటనే నిర్మాణం నిలిపివేయాలని, భూమి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్

వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో ప్రభుత్వ భూమి పరిరక్షణ పై మరోసారి వివాదం నెలకొంది. పట్టణంలోని సర్వే నంబర్ 111లో ఉన్న ప్రభుత్వ విజయ విద్యాలయ ఉన్నత పాఠశాల భూమి పై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు మరియు నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా 12 మంది కౌన్సిలర్ల సంతకాలతో కూడిన ఫిర్యాదు పత్రాన్ని తాండూర్ మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓ, ఎమ్మార్వోలకు అందజేశారు. ఈ ఫిర్యాదులో పాఠశాల భూమి పై షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పేరుతో ఆక్రమణ జరుగుతోందని స్పష్టం చేస్తూ,.బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ దీపా నర్సింలు ఆదేశాలతో అధికారులకు అందజేశారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ… పాఠశాలకు చెందిన విలువైన భూమిని వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించడం తీవ్రంగా ఖండించారు. కోర్టు ఆదేశాలను కూడా లెక్కచేయకుండా ఈ నిర్మాణాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు.
ఇది ప్రజా ప్రయోజనాలకు, విద్యా వ్యవస్థకు మరియు చట్టాలకు విరుద్ధమని పేర్కొంటూ… వెంటనే ఈ అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ మరియు పాఠశాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని అధికారులను కోరారు.
ప్రజల ఆస్తులను కాపాడటంలో అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఈర్షాద్, జావిద్, యోగానంద్, అనిల్, అలాగే నాయకులు సంతోష్ గౌడ్, రుద్రుపాటిల్, ఏజాజ్ తదితరులు పాల్గొన్నారు.

🗓 08 Apr 2026 | 05:35 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top