ఆర్యవైశ్య సంఘం – మా ఈఎన్‌టీ ఆస్పత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా ఈఎన్‌టీ వైద్య శిబిరానికి విశేష స్పందన

. చెవి, ముక్కు, గొంతు సమస్యలతో బాధపడుతున్న 200 మందికి నిపుణుల వైద్య పరీక్షలుతాండూర్ ఆర్యవైశ్య సంఘం, హైదరాబాద్‌కు చెందిన మా ఈఎన్‌టీ ఆస్పత్రి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా ఈఎన్‌టీ (చెవి–ముక్కు–గొంతు) వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. శనివారం తాండూర్ పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణమండపంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరానికి చెవి, ముక్కు, గొంతు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రోగులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఈ శిబిరంలో సుమారు 200 మందికి పైగా రోగులకు ఉచిత వైద్య పరీక్షలు, సలహాలు, చికిత్సలు అందించారు. హైదరాబాద్‌కు చెందిన మా ఈఎన్‌టీ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది ఆధునిక పరికరాలతో రోగులను పరీక్షించి అవసరమైన వారికి మందులు అందించడంతో పాటు, మరింత మెరుగైన చికిత్స అవసరమైన వారిని హైదరాబాద్ ఆస్పత్రికి రిఫర్ చేశారు.ఈ సందర్భంగా మా ఈఎన్‌టీ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ సార్థక్, డాక్టర్ మేఘనాథ్ మాట్లాడుతూ, కర్ణాటక సరిహద్దుకు ఆనుకుని ఉన్న తాండూర్ ప్రాంతంలో ప్రజలకు ప్రత్యేక వైద్య సేవలు అందించడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు చెవి, ముక్కు, గొంతు సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారని తెలిపారు. ఈ ప్రాంతంలో ఈఎన్‌టీ నిపుణులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు సరైన సమయంలో చికిత్స పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఆర్యవైశ్య సంఘం సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి ప్రజలకు సేవలందించడం జరిగిందన్నారు. అవసరమైన వారికి హైదరాబాద్‌లో మరింత మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కోటం మురళీకృష్ణ మాట్లాడుతూ, సంఘ సభ్యుల సహకారంతో గత రెండు నెలలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కేవలం సంఘ సభ్యులకే కాకుండా తాండూర్ ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టడం తమ లక్ష్యమని చెప్పారు. భవిష్యత్తులో కూడా వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సమాజం కార్యదర్శి కిరణ్ కుమార్, సభ్యులు శ్రీకాంత్, సతీష్, అనిల్ కుమార్,
సాగర్, రాఘవేందర్, యువజన సంఘం నాయకులు, మా ఆస్పత్రి ఇంచార్జ్ రాజేష్, కోఆర్డినేటర్ అఖిల్, ఆస్పత్రి వైద్య సిబ్బంది, సంఘ సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

🗓 18 Jul 2026 | 07:38 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top