విద్యా, వైద్యరంగంలోA S GMK సేవలు అభినందనీయం..ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

విద్యా, వైద్యరంగంలోA S GMK సేవలు అభినందనీయం..ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

ప్రభుత్వ పథకాల పంపిణీలో జీఎంకే ట్రస్టుకు భాగస్వామ్యం కల్పిస్తాం

ట్రస్టు తరపున నూతన కౌన్సిలర్లకు సన్మానం

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో విద్యా వైద్య రంగంలో A S GMK ట్రస్టు చేస్తున్న సేవలు అభినందనీయమని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఏ ఎస్ జీఎంకే ట్రస్ట్ చైర్మన్ ముజీబ్ ఖాన్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నుకోబడిన మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్ తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన నూతన కౌన్సిలర్లకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ… జీఎంకే ట్రస్ట్ ఏర్పాటుచేసి ముజీబ్ ఖాన్ నిరుపేదలైన వారికి కుల మతాల కతీతంగా ఇళ్ల స్థలాలు పంపిణి చేయడంతో పాటు, నిరుద్యోగ యువతీలకు కుట్టు మిషన్ ట్రైనింగులు ఏర్పాటు చేయడం, అదేవిధంగా విద్యారంగంలో వెనుకబడిన వారికి ఆర్థిక సహాయం చేయడం, వైద్యరంగంలో నిరుపేదలకు సేవ చేయడం ఎంతో గొప్ప విషయం అన్నారు. చాలామందికి డబ్బులు ఉన్న సేవ చేయరన్నారు. ముజీబ్ ఖాన్ మాత్రం తాను సంపాదించిన డబ్బులు 30% ట్రస్టు ద్వారా పేదలకు సేవ చేయడం ఎంతో గొప్ప విషయమని మనోహర్ రెడ్డి ట్రస్టు చైర్మన్ ను ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వం ద్వారా పేదలకు అందిస్తున్న పథకాలలో జిఎంకే ట్రస్ట్ కు భాగస్వామ్యం చేస్తామని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు.ఈ సందర్భంగా జిఎం కి ట్రస్ట్ చైర్మన్ ముజీబ్ ఖాన్ మాట్లాడుతూ… తాము ట్రస్టు ద్వారా పేదలకు అందిస్తున్న సేవలకు ప్రభుత్వం తరఫున చేయూతనివ్వాలని ఎమ్మెల్యేను కోరారు. విద్యారంగంలో తాండూరు పట్టణంలో నిరుద్యోగ యువకుల కోసం త్వరలో బీఈడీ కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డిసిసి జిల్లా అధ్యక్షులు ధారాసింగ్, ట్రస్టు లీగల్ అడ్వైజర్ కరణం పురుషోత్తం రావు, అబ్దుల్ రావుఫ్, నయీమ్ అత్తర్, అబ్దుల్ ఆహాద్, కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనార్టీ నేతలు పాల్గొన్నారు.

విద్యా, వైద్యరంగంలోA S GMK సేవలు అభినందనీయం..ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

విద్యా, వైద్యరంగంలోA S GMK సేవలు అభినందనీయం..ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

ప్రభుత్వ పథకాల పంపిణీలో జీఎంకే ట్రస్టుకు భాగస్వామ్యం కల్పిస్తాం

ట్రస్టు తరపున నూతన కౌన్సిలర్లకు సన్మానం

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో విద్యా వైద్య రంగంలో A S GMK ట్రస్టు చేస్తున్న సేవలు అభినందనీయమని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఏ ఎస్ జీఎంకే ట్రస్ట్ చైర్మన్ ముజీబ్ ఖాన్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నుకోబడిన మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్ తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన నూతన కౌన్సిలర్లకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ... జీఎంకే ట్రస్ట్ ఏర్పాటుచేసి ముజీబ్ ఖాన్ నిరుపేదలైన వారికి కుల మతాల కతీతంగా ఇళ్ల స్థలాలు పంపిణి చేయడంతో పాటు, నిరుద్యోగ యువతీలకు కుట్టు మిషన్ ట్రైనింగులు ఏర్పాటు చేయడం, అదేవిధంగా విద్యారంగంలో వెనుకబడిన వారికి ఆర్థిక సహాయం చేయడం, వైద్యరంగంలో నిరుపేదలకు సేవ చేయడం ఎంతో గొప్ప విషయం అన్నారు. చాలామందికి డబ్బులు ఉన్న సేవ చేయరన్నారు. ముజీబ్ ఖాన్ మాత్రం తాను సంపాదించిన డబ్బులు 30% ట్రస్టు ద్వారా పేదలకు సేవ చేయడం ఎంతో గొప్ప విషయమని మనోహర్ రెడ్డి ట్రస్టు చైర్మన్ ను ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వం ద్వారా పేదలకు అందిస్తున్న పథకాలలో జిఎంకే ట్రస్ట్ కు భాగస్వామ్యం చేస్తామని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు.ఈ సందర్భంగా జిఎం కి ట్రస్ట్ చైర్మన్ ముజీబ్ ఖాన్ మాట్లాడుతూ... తాము ట్రస్టు ద్వారా పేదలకు అందిస్తున్న సేవలకు ప్రభుత్వం తరఫున చేయూతనివ్వాలని ఎమ్మెల్యేను కోరారు. విద్యారంగంలో తాండూరు పట్టణంలో నిరుద్యోగ యువకుల కోసం త్వరలో బీఈడీ కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డిసిసి జిల్లా అధ్యక్షులు ధారాసింగ్, ట్రస్టు లీగల్ అడ్వైజర్ కరణం పురుషోత్తం రావు, అబ్దుల్ రావుఫ్, నయీమ్ అత్తర్, అబ్దుల్ ఆహాద్, కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనార్టీ నేతలు పాల్గొన్నారు.

🗓 17 Feb 2026 | 01:28 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top