నల్లమల అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం కలకలం

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం నల్లమల అటవీ ప్రాంతంలోని బ్రహ్మగిరి రేంజ్ పరిధిలో మంటలు చెలరేగాయి. తాటి గుండాల సెక్షన్ సమీపంలో అడవి ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పొడి గడ్డి, ఎండల తీవ్రతతో మంటలు వేగంగా వ్యాపించాయి. శాటిలైట్ ద్వారా మంటలను గుర్తించిన అటవీ అధికారులు సెక్షన్ అధికారి గురు ప్రసాద్ ఆధ్వర్యంలో 20మంది సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ఆపారు.
ఈ సందర్భంగా అధికారులు… స్థానికులు అప్రమత్తంగా ఉండాలని, చెత్తకునిప్పు పెట్టరాదని, అడవిలో సిగరెట్లు కాల్చరాదని తెలిపారు. కాగా అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. వన్యప్రాణులు, అడవి సంపదకు నష్టం కలగకుండా చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదంలో 60హెక్టార్లలో అటవి దగ్ధం అయినట్లుగా అధికారులు భావిస్తున్నారు.
*నల్లమల అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం కలకలం*
నల్లమల అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం కలకలం
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం నల్లమల అటవీ ప్రాంతంలోని బ్రహ్మగిరి రేంజ్ పరిధిలో మంటలు చెలరేగాయి. తాటి గుండాల సెక్షన్ సమీపంలో అడవి ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పొడి గడ్డి, ఎండల తీవ్రతతో మంటలు వేగంగా వ్యాపించాయి. శాటిలైట్ ద్వారా మంటలను గుర్తించిన అటవీ అధికారులు సెక్షన్ అధికారి గురు ప్రసాద్ ఆధ్వర్యంలో 20మంది సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ఆపారు.
ఈ సందర్భంగా అధికారులు... స్థానికులు అప్రమత్తంగా ఉండాలని, చెత్తకునిప్పు పెట్టరాదని, అడవిలో సిగరెట్లు కాల్చరాదని తెలిపారు. కాగా అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. వన్యప్రాణులు, అడవి సంపదకు నష్టం కలగకుండా చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదంలో 60హెక్టార్లలో అటవి దగ్ధం అయినట్లుగా అధికారులు భావిస్తున్నారు.