పెంపుడు కుక్కకు దశదినకర్మ చేసిన కుటుంబం… కాలనీవాసులకు సహపంక్తి భోజనాలు…




పెంపుడు కుక్కకు దశదినకర్మ చేసిన కుటుంబం… కాలనీవాసులకు సహపంక్తి భోజనాలు…
పెంపుడు కుక్కకు దశదినకర్మ చేసిన కుటుంబం... కాలనీవాసులకు సహపంక్తి భోజనాలు...
సాంకేతిక పరిజ్ఞానం పెంపొందుతున్న ఆధునిక ప్రపంచంలో మానవతా విలువలు మంట కలిసి పోతున్నాయి. ఆప్యాయతలు, అనురాగాలు పెదవులు దాటడం లేదు. ఇలాంటి తరుణంలో అల్లారుముద్దుగా పెంచుకున్న తమ ఇంటి పెంపుడు కుక్క (రిమో) మరణించడంతో ఆ కుటుంబం కన్నీటి పర్యంతమయ్యారు. అంతేకాకుండా సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు చేసి, దశదినకర్మ నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయ కాలనీకి చెందిన భాస్కర్ రెడ్డి- అన్నపూర్ణ దంపతుల పెంపుడు కుక్క రెమో ఇటీవల మరణించింది. దీంతో కుటుంబంతోపాటు ఇరుగుపొరుగువారు సైతం ఆవేదన వ్యక్తం చేశారు. సాంప్రదాయం ప్రకారం దానిని సమాధి చేసి, దశదినకర్మ నిర్వహించారు. పెంపుడు కుక్క ఫోటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంతేకాకుండా దశదిన కర్మ చేసి కాలనీవాసులకు సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇంటి యజమానురాలు అన్నపూర్ణ మాట్లాడుతూ... తన కొడుకు అమెరికా వెళుతున్న సందర్భంలో 20 రోజుల పెంపుడు కుక్కను తనకు గిఫ్టుగా ఇచ్చి వెళ్ళాడని గుర్తు చేసింది. మూడేళ్ల ఇంటిలో ఓ మనిషి లా తమకు రక్షణగా ఉంటూ మరణించడం బాధాకరమని పేర్కొంది.
