*శివాజీ మనందరికీ ఆదర్శప్రాయుడు*
*యాలాల మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా*
*యాలాల*.. వికారాబాద్ జిల్లా యాలాల మండలం జుంటిపల్లి గ్రామం లో శివాజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న యాలాల మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా. గురువారం జుంటిపల్లి గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఆయన వేడుకల్లో పాల్గొన్నాడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హైందవ స్వరాజ్య స్థాపకుడు, బహుజనుల పాలకుడు, జనతా రాజా శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ అని గ్రామ శివాజీ మహారాజ్ చౌక్ వద్ద జరిగిన ఈ వేడుకలకు పెద్ద ఎత్తున యువకులు, మహిళలు హాజరయ్యారు. సంప్రదాయబద్ధంగా దుస్తులు ధరించి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమం జరుగుతున్నంతసేపూ బాణాసంచా పేల్చి, ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ జై అనే నినాదాలతో శివాజీచౌక్ పరిసరాలు మార్మోగాయి. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హైందవ స్వరాజ్యం ఏర్పాటు కోసం అహర్నీశలు కృషిచేసిన మహనీయుడు ఛత్రపతి శివాజీ అన్నారు. దౌర్జన్యం, బానిసత్వాన్ని పారద్రోలేందుకు విదేశీయులపై దండయాత్ర చేసి స్వయం ప్రతిపత్తి గల రాజ్యాన్ని స్థాపించిన శివాజీ , ఆయన భావజాలాన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవలసిన అవసరముందని హితవు పలికారు. తన రాజ్యంలోని ఆడవాళ్ల అందరిని మరియు తన శత్రురాజ్య స్త్రీలను తన తోబుట్టువులుగా భావించి పసుపు, కుంకుమ, చీరలు ఇచ్చేవారని అలాంటి ధీరుడు భరతఖండంలో జన్మించడం మన అదృష్టంగా భావించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు విజయ్, నారాయణ రెడ్డి, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.