ప్రతి ఓటుపై నిఘా.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన పంజుగుల శ్రీశైల్ రెడ్డి

అర్హుడికి ఓటు హక్కు.. బోగస్ ఓట్లకు చెక్.. బీఆర్ఎస్ ఇంచార్జ్రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంపై బీఆర్ఎస్ పార్టీ తాండూర్ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ తాండూర్ నియోజకవర్గ ఇంచార్జ్ పంజుగులశ్రీశైల్ రెడ్డి బుధవారం తాండూర్ టౌన్‌లోని 1, 8, 28, 36 వార్డుల్లో విస్తృతంగా పర్యటించి ఎన్యూమరేషన్ ప్రక్రియను పరిశీలించారు.
ఇంటింటికి వెళ్లి ఓటరు నమోదు, సవరణ కార్యక్రమం ఎలా సాగుతోందో స్వయంగా పరిశీలించిన ఆయన, విధులు నిర్వహిస్తున్న BLOలు, BLAలుతో సమావేశమై క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సందేహాలు, అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటూ ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా శ్రీశైల్ రెడ్డి మాట్లాడుతూ,.. “ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. అర్హత ఉన్న ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తప్పిపోకూడదు. అదే సమయంలో బోగస్ ఓట్లకు ఏమాత్రం అవకాశం ఉండకూడదు. ఓటరు జాబితా పూర్తిగా పారదర్శకంగా, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా రూపొందాలి” అని స్పష్టం చేశారు.
ఎన్యూమరేషన్ విధుల్లో ఉన్న BLOలకు మరింత శిక్షణ, స్పష్టమైన మార్గదర్శకాలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఫామ్-6, ఫామ్-8 దరఖాస్తులపై ప్రజలకు సరైన సమాచారం అందించి, అపోహలకు తావివ్వకుండా ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ నెల 24వ తేదీతో SIR ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో, ఇప్పటివరకు ఫారాలు అందని వారు వెంటనే తమ పరిధిలోని BLOలు లేదా BLAలను సంప్రదించి దరఖాస్తులు పూర్తి చేసి సమర్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే ఎక్కడైనా బోగస్ ఓట్లు లేదా అక్రమ నమోదు జరిగినట్లు గుర్తిస్తే వెంటనే ఎన్నికల అధికారులకు లేదా పార్టీ ప్రతినిధులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
“నిజమైన ఓటరికి న్యాయం జరగడం, అక్రమ ఓటరు నమోదును అడ్డుకోవడం ప్రతి రాజకీయ పార్టీతో పాటు ప్రతి పౌరుడి బాధ్యత. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటు అమూల్యం” అని శ్రీశైల్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తాండూర్ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, నర్సింహులు, ఫ్లోర్ లీడర్ దీపా నర్సింహులు, సీనియర్ మహిళా నాయకురాలు శోభారాణి, శ్రీనివాస్ చారి, వెంకట్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రతి ఓటుపై నిఘా.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన పంజుగుల శ్రీశైల్ రెడ్డి

ప్రతి ఓటుపై నిఘా.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన పంజుగుల శ్రీశైల్ రెడ్డి

అర్హుడికి ఓటు హక్కు.. బోగస్ ఓట్లకు చెక్.. బీఆర్ఎస్ ఇంచార్జ్రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంపై బీఆర్ఎస్ పార్టీ తాండూర్ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ తాండూర్ నియోజకవర్గ ఇంచార్జ్ పంజుగులశ్రీశైల్ రెడ్డి బుధవారం తాండూర్ టౌన్‌లోని 1, 8, 28, 36 వార్డుల్లో విస్తృతంగా పర్యటించి ఎన్యూమరేషన్ ప్రక్రియను పరిశీలించారు.
ఇంటింటికి వెళ్లి ఓటరు నమోదు, సవరణ కార్యక్రమం ఎలా సాగుతోందో స్వయంగా పరిశీలించిన ఆయన, విధులు నిర్వహిస్తున్న BLOలు, BLAలుతో సమావేశమై క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సందేహాలు, అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటూ ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా శ్రీశైల్ రెడ్డి మాట్లాడుతూ,.. "ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. అర్హత ఉన్న ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తప్పిపోకూడదు. అదే సమయంలో బోగస్ ఓట్లకు ఏమాత్రం అవకాశం ఉండకూడదు. ఓటరు జాబితా పూర్తిగా పారదర్శకంగా, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా రూపొందాలి" అని స్పష్టం చేశారు.
ఎన్యూమరేషన్ విధుల్లో ఉన్న BLOలకు మరింత శిక్షణ, స్పష్టమైన మార్గదర్శకాలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఫామ్-6, ఫామ్-8 దరఖాస్తులపై ప్రజలకు సరైన సమాచారం అందించి, అపోహలకు తావివ్వకుండా ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ నెల 24వ తేదీతో SIR ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో, ఇప్పటివరకు ఫారాలు అందని వారు వెంటనే తమ పరిధిలోని BLOలు లేదా BLAలను సంప్రదించి దరఖాస్తులు పూర్తి చేసి సమర్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే ఎక్కడైనా బోగస్ ఓట్లు లేదా అక్రమ నమోదు జరిగినట్లు గుర్తిస్తే వెంటనే ఎన్నికల అధికారులకు లేదా పార్టీ ప్రతినిధులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
"నిజమైన ఓటరికి న్యాయం జరగడం, అక్రమ ఓటరు నమోదును అడ్డుకోవడం ప్రతి రాజకీయ పార్టీతో పాటు ప్రతి పౌరుడి బాధ్యత. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటు అమూల్యం" అని శ్రీశైల్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తాండూర్ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, నర్సింహులు, ఫ్లోర్ లీడర్ దీపా నర్సింహులు, సీనియర్ మహిళా నాయకురాలు శోభారాణి, శ్రీనివాస్ చారి, వెంకట్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

🗓 15 Jul 2026 | 07:02 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top