ప్రయాణికురాలు పోగొట్టుకున్న పర్సును అప్పగించిన తాండూరు ఆర్టీసీ కండక్టర్
రూ.5 వేల నగదు, విలువైన పత్రాలతో కూడిన పర్సు యజమానికి సురక్షితంగా అందజేత
కండక్టర్ ఎన్. రవిని అభినందించిన డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్
తాండూరు ఆర్టీసీ డిపోకు చెందిన కండక్టర్ ఎన్. రవి తన నిజాయితీని చాటుకుంటూ ప్రయాణికురాలు బస్సులో మరిచిపోయిన పర్సును సురక్షితంగా తిరిగి అప్పగించి ప్రశంసలు అందుకున్నారు.తాండూరు–కొత్లాపూర్ మార్గంలో నడిచే ఆర్టీసీ బస్సులో బషీరాబాద్ నుంచి తాండూరుకు ప్రయాణించిన ఎక్మయి గ్రామానికి చెందిన శ్రీమతి పుప్పలి శశికళ బస్సు దిగే సమయంలో తన పర్సును సీటులోనే మరిచిపోయారు. బస్సులో విధులు నిర్వహిస్తున్న కండక్టర్ ఎన్. రవి పర్సును గమనించి వెంటనే బాధ్యతాయుతంగా తాండూరు డిపో అధికారులకు, భద్రతా సిబ్బందికి అప్పగించారు.
అనంతరం డిపో అధికారులు పర్సులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా ప్రయాణికురాలి వివరాలను గుర్తించి, ఫోన్ ద్వారా ఆమెను సంప్రదించారు. ఆమె డిపోకు చేరుకున్న అనంతరం పర్సును పరిశీలించి, అందులో ఉన్న సుమారు రూ.5,000 నగదు, విలువైన వ్యక్తిగత పత్రాలతో సహా యథాతథంగా ఆమెకు అప్పగించారు.తన పోగొట్టుకున్న పర్సు తిరిగి లభించడంతో శ్రీమతి పుప్పలి శశికళ ఆనందం వ్యక్తం చేస్తూ, నిజాయితీగా వ్యవహరించిన కండక్టర్ ఎన్. రవికి, సహకరించిన తాండూరు డిపో అధికారులకు, భద్రతా సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా తాండూరు డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్ కండక్టర్ ఎన్. రవి నిజాయితీ, విధి నిర్వహణలో చూపిన బాధ్యతాయుత సేవాభావాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఇటువంటి సంఘటనలు టీజీఎస్‌ఆర్‌టీసీ సిబ్బంది ప్రజలకు అందిస్తున్న విశ్వసనీయమైన, నమ్మకమైన సేవలకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల ఆస్తులను కాపాడడంలో ఆర్టీసీ సిబ్బంది ఎల్లప్పుడూ బాధ్యతతో వ్యవహరిస్తారని ఆయన తెలిపారు.
ప్రయాణికురాలు పోగొట్టుకున్న పర్సును అప్పగించిన తాండూరు ఆర్టీసీ కండక్టర్
ప్రయాణికురాలు పోగొట్టుకున్న పర్సును అప్పగించిన తాండూరు ఆర్టీసీ కండక్టర్
రూ.5 వేల నగదు, విలువైన పత్రాలతో కూడిన పర్సు యజమానికి సురక్షితంగా అందజేత
కండక్టర్ ఎన్. రవిని అభినందించిన డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్తాండూరు ఆర్టీసీ డిపోకు చెందిన కండక్టర్ ఎన్. రవి తన నిజాయితీని చాటుకుంటూ ప్రయాణికురాలు బస్సులో మరిచిపోయిన పర్సును సురక్షితంగా తిరిగి అప్పగించి ప్రశంసలు అందుకున్నారు.తాండూరు–కొత్లాపూర్ మార్గంలో నడిచే ఆర్టీసీ బస్సులో బషీరాబాద్ నుంచి తాండూరుకు ప్రయాణించిన ఎక్మయి గ్రామానికి చెందిన శ్రీమతి పుప్పలి శశికళ బస్సు దిగే సమయంలో తన పర్సును సీటులోనే మరిచిపోయారు. బస్సులో విధులు నిర్వహిస్తున్న కండక్టర్ ఎన్. రవి పర్సును గమనించి వెంటనే బాధ్యతాయుతంగా తాండూరు డిపో అధికారులకు, భద్రతా సిబ్బందికి అప్పగించారు.