విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడితే సహించేది లేదు..
నీట్ పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరపాలి: ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి”
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా యాలాల్ మండలం లక్ష్మినారాయణపూర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, లక్షలాది మంది విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం కష్టపడి చదువుతుంటే పేపర్ లీకేజీల వల్ల వారి ఆశలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి చదివిన విద్యార్థులకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడితే సహించేది లేదని స్పష్టం చేశారు.నీట్ పేపర్ లీకేజీ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని, నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని ఆయన కోరారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పార్లమెంట్‌లో సమగ్ర చర్చ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులకు మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీపై పోలీసులతో దాడి చేయించడం ఖండనీయమని పేర్కొంటూ, తాండూర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడితే సహించేది లేదు.. : ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి”
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడితే సహించేది లేదు..
నీట్ పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరపాలి: ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి"