యాలాల మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా సిహెచ్ శివయ్య ఎన్నిక.. ఘన సన్మానం
గ్రామాభివృద్ధే లక్ష్యం.. సర్పంచుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తా: సిహెచ్ శివయ్య
ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: ఎస్ఐ విఠల్ రెడ్డి
అధికారులు–ప్రజాప్రతినిధుల సమన్వయంతోనే గ్రామాల సమగ్ర అభివృద్ధి: ఎంపీడీవో శ్రీనిజ
యాలాల గ్రామ సర్పంచ్ సిహెచ్ శివయ్య నూతన యాలాల మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో మండలంలోని సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సోమవారం ఘనంగా సన్మానించారు. శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకు నూతన బాధ్యతల్లో విజయాన్ని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.., గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, సర్పంచుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్న సిహెచ్ శివయ్య సేవలను గుర్తించి ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించడం అభినందనీయమన్నారు. మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి ఆయన నాయకత్వం మరింత దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీడీవో శ్రీనిజ మాట్లాడుతూ.., నూతన అధ్యక్షుడు సిహెచ్ శివయ్యకు అభినందనలు తెలియజేస్తూ, అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేసేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు.
అలాగే
యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి మాట్లాడుతూ.., గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ఆధునిక సాంకేతికతను వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాల నియంత్రణతో పాటు ప్రజల భద్రత మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. గ్రామస్తుల సహకారంతో భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు.
నూతన అధ్యక్షుడు సిహెచ్ శివయ్య మాట్లాడుతూ,.. తనపై విశ్వాసం ఉంచి అధ్యక్షుడిగా ఎన్నుకున్న మండలంలోని సర్పంచులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచుల హక్కుల పరిరక్షణ, గ్రామపంచాయతీల అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమర్థ అమలు, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారానికి అందరినీ సమన్వయం చేసుకుంటూ నిబద్ధతతో పనిచేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి గ్రామం అభివృద్ధి చెందేలా సమిష్టి కృషితో ముందుకు సాగుతానని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఐ విఠల్ రెడ్డి, మండల విద్యాధికారి మహిపాల్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహిపాల్, ఉప సర్పంచుల సంఘం అధ్యక్షులు అగ్గనూర్ వెంకటయ్య, సర్పంచుల సంఘం ఉపాధ్యక్షులు పెర్కంపల్లి నర్సిములు, గంగాసాగర్ మల్లేశం, కార్యదర్శులు మీనాక్షి, ఓమ్లా నాయక్ తాండ, రుక్మిణి గౌడ్ (అడల్పూర్), ఆర్గనైజర్ గొర్రెపల్లి వై. లక్ష్మీ మల్లేశం, ట్రెజరర్ పగిడిపల్లి శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ నాయకులు, అధికారులు పాల్గొని నూతన అధ్యక్షుడు సిహెచ్ శివయ్యకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో ముగిసింది.