*రాష్ట్ర బడ్జెట్‌లో బీసీలకు ₹50 వేల కోట్లు కేటాయించాలి*
*బీసీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించాలి*
*కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీల అమలుకు పూర్తి స్థాయి బడ్జెట్ కేటాయించాలి*
*పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్,స్కాలర్‌షిప్‌లకు బడ్జెట్ కేటాయించాలి*
*బీసీ విద్యార్థుల విదేశీ విద్య రుణాలకు ₹5,000 కోట్లు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి*
*అన్ని బీసీ కులాల కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు ప్రత్యేక నిధులు కేటాయించాలి*
— జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌లో బీసీల సంక్షేమం కోసం ₹50 వేల కోట్లు కేటాయించి, బీసీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూర్ నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు.సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ,2023లో ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీల కోసం చట్టబద్ధమైన బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి, ప్రతి సంవత్సరం సుమారు ₹20 వేల కోట్లు ప్రత్యేకంగా కేటాయిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే ఇప్పటివరకు ఆ హామీలు పూర్తి స్థాయిలో అమలు కాలేదని రాజ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.గత రెండు సంవత్సరాలుగా బీసీలకు కేవలం ₹9,200 కోట్లు (2024–25) మరియు ₹11,405 కోట్లు (2025–26) మాత్రమే కేటాయింపులు జరిగాయని తెలిపారు. ప్రతి సంవత్సరం ₹20 వేల కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చినా, వాస్తవ కేటాయింపుల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శించారు.ఈ నెల 26 నుండి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి ₹50 వేల కోట్లు ప్రత్యేకంగా కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు,అలాగే గత ఏడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని తక్షణమే విడుదల చేయాలని, దానికి తగిన బడ్జెట్ కేటాయించాలని, పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు పూర్తి స్థాయి బడ్జెట్ కేటాయించాలని,బీసీ కులాలకు చెందిన అన్ని కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు ప్రత్యేక నిధులు కేటాయించి వాటి ద్వారా బీసీ కులాల అభివృద్ధికి కృషి చేయాలని,బీసీ విద్యార్థుల విదేశీ ఉన్నత విద్య కోసం మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యా నిధికి విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ₹5,000 కోట్లు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని రాజ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు