వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు

వేడుకలలో పాల్గొన్న జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్.

హోలీ పండుగను పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో రంగుల వేడుకలు అత్యంత ఉత్సాహంగా, వైభవంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది, హోం గార్డులు మరియు వారి కుటుంబ సభ్యులు ఒకరి పై ఒకరు రంగులు చల్లుకుంటూ జరిగిన ఈ వేడుకలలో స్నేహభావం, ఐక్యత, సోదరభావాన్ని ప్రతిబింబించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులు, సిబ్బంది, హోం గార్డులు మరియు వారి కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు.

“మంచి చెడుపై గెలుపును సూచించే రంగుల పండుగ అయిన హోలీ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త వెలుగును, ఆనందాన్ని నింపాలి” ఎస్పీ స్నేహ మెహ్రా అన్నారు. అలాగే, జిల్లా పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ ఒకే కుటుంబ సభ్యులని, నిరంతరం విధుల్లో నిమగ్నమై ఉండే సిబ్బందికి ఇటువంటి వేడుకలు మానసిక ఉల్లాసాన్ని కలిగించి పరస్పర ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఏఆర్ డీఎస్పీ వీరేష్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఉమెన్ ఇన్స్పెక్టర్,ఇన్స్పెక్టర్ లు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్.ఐ లు, RSI లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

🗓 03 Mar 2026 | 01:59 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top