జీతాలు అందక ఆందోళనలో ఉపాధ్యాయులు*

*జీతాలు అందక ఆందోళనలో ఉపాధ్యాయులు*

*అధికారుల నిర్లక్ష్యం – ఉద్యోగుల జీతాలకు గ్రహణం*

*చేయని తప్పుకు, శిక్ష ఎందుకు?*

రాష్ట్రవ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయుల వివరాలను ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (IFMIS) వెబ్‌సైట్‌లో ఉద్యోగుల ఆధార్ కార్డులో ఉన్న వివరాలతో సరిపోల్చుకోవాలని ప్రభుత్వం గత నాలుగు నెలల క్రితమే సంబంధిత డీడీఓలకు సూచనలు జారీ చేసింది.అయితే కొందరు డీడీఓలకు సరైన సమాచారం అందకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5,000 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల వివరాలు ఆధార్ మరియు IFMIS మధ్య మిస్‌మ్యాచ్ అయినట్లు తెలిసింది.
ఈ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 216 మంది ప్రభుత్వ ఉపాధ్యాయుల ఫిబ్రవరి నెల జీతాలు నిలిచిపోయాయి. ఫిబ్రవరి నెలకు సంబంధించిన జీతాలు ఈరోజు వరకు అందకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
జీతాలు అందకపోవడంతో బ్యాంక్ ఈఎంఐలు చెల్లించలేక చెక్కులు బౌన్స్ అవుతున్నాయని, సివిల్ స్కోర్ పడిపోతుందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రంజాన్, ఉగాది వంటి ప్రధాన పండుగల సమయంలో జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఆత్మాభిమానంతో జీవించే వాళ్ళము నేడు అప్పులకోసం చేతులు చాయాల్సిన దుస్థితి ఏర్పడ్డదని మనోవేదనకు గురి అవుతున్నారు.
వికారాబాద్ జిల్లాలో ముఖ్యంగా బొంరాస్పేట్ ఉన్నత పాఠశాలలో సుమారు 15 మంది ఉపాధ్యాయులకు ఫిబ్రవరి నెల జీతం ఇప్పటివరకు జమ కాలేదని సమాచారం.ఈ విషయంపై స్పందించిన ఉపాధ్యాయులు మాట్లాడుతూ, తమ ప్రమేయం లేకుండానే జీతాలు నిలిపివేయడం చాలా బాధాకరమని తెలిపారు. తాము సస్పెండ్ అయ్యామా అనే భావన కలుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మనోవేదనతో ఎటువంటి అనర్థాలు జరిగినా బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు.
ఫిబ్రవరి నెల జీతాలు క్లియర్ అయిన తరువాతనే మార్చి నెల జీతాలు చెల్లించబడే పరిస్థితి ఉందని వారు పేర్కొన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే డీడీఓలకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం ద్వారా IFMIS–ఆధార్ మిస్‌మ్యాచ్ సమస్యను పరిష్కరించి పెండింగ్‌లో ఉన్న జీతాలను తక్షణమే విడుదల చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

జీతాలు అందక ఆందోళనలో ఉపాధ్యాయులు*

*జీతాలు అందక ఆందోళనలో ఉపాధ్యాయులు*

*అధికారుల నిర్లక్ష్యం - ఉద్యోగుల జీతాలకు గ్రహణం*

🗓 09 Mar 2026 | 06:47 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top