కాంగ్రెస్ నేతలతో రంజాన్ తోపా కిట్ల పంపిణీ పై బీఆర్ఎస్ ఆగ్రహం

స్థానిక కౌన్సిలర్లను పక్కన పెట్టి కాంగ్రెస్ నేతలతో పంపిణీ

అసంతృప్తి వ్యక్తం చేసిన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు

రంజాన్ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న రంజాన్ తోఫా కిట్ల పంపిణీ పై రాజకీయ వివాదం చెలరేగింది.
స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ నేతలతో కిట్లను పంపిణీ చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ కి చెందిన కాన్సిలర్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ మండిపడ్డారు. శనివారం తాండూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌన్సిలర్లు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు ఈర్షాద్, అనిల్, యోగానంద్, జవీద్ నాయకులు సంతోష్‌ గౌడ్, ఎజాజ్ తదితరులు మీడియాతో మాట్లాడుతూ..
ప్రభుత్వ పథకాలను పార్టీ ప్రచారంగా మార్చడం సరికాదని అన్నారు, స్థానిక ప్రజాప్రతినిధులను గౌరవించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పట్టణంలో పార్టీలకతీతంగా కౌన్సిలర్లకు ప్రాధాన్యం ఉంటుందని కౌన్సిల్ సమావేశంలో అలాగే మీడియా ముందు అనేకమార్లు చెప్పిన సంగతి గుర్తు చేశారు, కానీ ప్రభుత్వం అందిస్తున్న కిట్ల పంపిణీలో ఎమ్మెల్యే నే స్థానిక కౌన్సిలర్లకు ప్రాధాన్యం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ నాయకుల చే , ఓడిపోయిన నాయకులచే కిట్లను పంపిణీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని విమర్శించారు.అదేవిధంగా పట్టణంలో ప్రతి వార్డులో వందల కొద్ది ముస్లిం సోదరులు ఉంటే 50-25 కిట్లను పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో 200 నుంచి 150 వరకు కిట్లను పంపిణీ చేసేవారమని అన్నారు.కిట్ల పంపిణిలో ముస్లిం కుటుంబాలకు న్యాయం జరగడం లేదని అన్నారు.మైనార్టీల వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ వారికే అన్యాయం జరుగుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలే బుద్ది చెప్పడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువనాయకులు ఇంతియాజ్, తదితరులు ఉన్నారు.

🗓 14 Mar 2026 | 05:32 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top