తాండూరులో ఎక్సైజ్ పోలీసుల దాడులు… 3.6 కిలోల గంజాయి స్వాధీనం

తాండూరులో ఎక్సైజ్ పోలీసుల దాడులు

3.6 కిలోల గంజాయి స్వాధీనం

పాలిష్ యూనిట్‌లో గంజాయి అక్రమ నిల్వ

బీహార్‌కు చెందిన కార్మికుడు అరెస్ట్

NDPS చట్టం కింద కేసు నమోదు

గంజాయి విక్రయాలపై కఠిన చర్యలు తప్పవు

జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి

వికారాబాద్ జిల్లా తాండూరులో ఎక్సైజ్ పోలీసులు భారీ దాడులు నిర్వహించి గంజాయి అక్రమ రవాణాను బయట పెట్టారు. విశ్వసనీయ సమాచారంతో చేసిన ఈ దాడుల్లో మొత్తం 3.6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వికారాబాద్ జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.

తాండూరు మండలం గౌతాపూర్ సమీపంలోని ఓ పాలిష్ యూనిట్‌లో గంజాయి నిల్వ ఉంచారన్న సమాచారం మేరకు ఎక్సైజ్ సిబ్బంది ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అక్కడ కార్మికుడిగా పనిచేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన ఎండి ముస్తాకిన్ వద్ద గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి.పోలీసుల విచారణలో నిందితుడు ముస్తాకిన్ కీలక విషయాలు వెల్లడించారు. బీహార్ రాష్ట్రం నుంచి గంజాయిని కొనుగోలు చేసి తాండూరుకు తీసుకువచ్చి, తాను పనిచేస్తున్న యూనిట్‌లోని ఇతర కార్మికులకు, అలాగే పరిసర ప్రాంతాల్లోని కూలీలకు విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నాడు.నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు, అతనిపై NDPS చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ సందర్భంగా ఏఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..గంజాయి విక్రయం, కొనుగోలు వంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా ఇలాంటి సమాచారాన్ని గమనించిన వెంటనే పోలీసులకుతెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ సీఐ రాణి, ఎస్సై రవికుమార్, మరియు సిబ్బంది భీమయ్య, రవి కిషోర్, రమేష్ రాజేందర్ సతీష్ తదితరులు ఉన్నారు.

🗓 18 Mar 2026 | 07:07 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top