డాక్టర్ నర్సిరెడ్డి మృతి పట్ల పలువురి సంతాపం… అంతక్రియలకు భారీగా జనం 

డాక్టర్ నర్సిరెడ్డి మృతి పట్ల పలువురి సంతాపం
అంతక్రియలకు భారీగా జనం

తాండూరు పట్టణంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యుడిగా పేరోందిన అల్లాపురం నర్సిరెడ్డి (75) అకాల మృతి పట్ల ఆయన సన్నిహితులు, పేషెంట్లు పలువురు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. బషీరాబాద్ మండల మాజీ పిఏసీఎస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి సోదరుడైన డాక్టర్ నర్సిరెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న అర్ధరాత్రి కన్నుమూశారు. దీంతో నర్సిరెడ్డి అంతక్రియలు స్వగ్రామమైన బషీరాబాద్ మండలం పర్వత్ పల్లి లో నేడు జరిగాయి. తాండూరు పట్టణం బస్టాండ్ వద్ద గల అరవింద్ కాంప్లెక్స్ లో నివాసం ఉంటూ డాక్టర్ నర్సి రెడ్డి తాండూరు చుట్టుపక్కల తో పాటు హైదరాబాద్,కర్ణాటక రాష్ట్రం సేడం,చించొలి ప్రాంతాల ప్రజలకు ఆయన వైద్యం అందించారు. వైద్యంతో పాటు తాండూరు,కోడంగల్ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పేద విద్యార్థులకు తన ఆసుపత్రి పక్కనే ఫ్రీ వసతి కల్పించి వారు పై చదువులు చదివేందుకు తోడ్పాటునందించారు. వైద్య వృత్తి తో పాటు డాక్టర్ నర్సిరెడ్డి భారతీయ జనతా పార్టీ,రాష్ట్ర,జిల్లా నాయకులతో కలిసి ఆ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న పలువురు బిజెపి నేతలు, నగరానికి చెందిన ఆయన స్నేహితులు హైదరాబాదులోని ఆసుపత్రి వద్దకు వెళ్లి తమ సంతాపాన్ని తెలియజేశారు. నేడు జరిగిన డాక్టర్ అంతక్రియల్లో పలు రాజకీయ నేతలతో పాటు, ఆయన వద్ద వైద్యం చేయించుకున్న రోగులు, ఆయన తోడ్పాటు తో పై చదువులు చదివిన పలువురు విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ డాక్టర్ నర్సిరెడ్డి తో తమకున్న అనుబంధాన్ని వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. డాక్టర్ మృతి పట్ల సంతాపం తెలియజేసిన వారిలో రంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు పంతంగి రాజగోపాల్ గౌడ్, రంగారెడ్డి జిల్లా మాజీ బిజెపి అధ్యక్షులు తోక అంజన్ కుమార్ గౌడ్ ,నారగూడెం మల్లారెడ్డి బిజెపి చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్ మోండ్ర కొమ్రురయ్య రంగారెడ్డి జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు షాబాద్ విజయ్ కుమార్ రంగారెడ్డి జిల్లా బిజెపి సెక్రెటరీ, బిజెపి రాష్ట్ర కమిటీ సభ్యులు అడ్వకేట్ మనోహర్ రావు, తాండూరు బిజెపి నేత శెట్టి రమేష్,కొండ్ర చంద్రశేఖర్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ ఉటువల్లి (శంషాబాద్ మండలం) శంషాబాద్ మండలం బిజెపి నేత శ్రీధర్ రెడ్డి ,బషీరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేందర్ రెడ్డి, పర్వత్ పల్లి సర్పంచ్ పాండురంగారెడ్డి తదితరులు హాజరయ్యారు.

🗓 19 Mar 2026 | 09:18 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top