నేడు అంతారం, బెల్కటూర్ రైతు వేదికలో ముఖ్యమంత్రి కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం
-వివరాలు వెల్లడించిన వ్యవసాయ శాఖ ఏడి కొమురయ్య

నేడు అంతారం, బెల్కటూర్ రైతు వేదికలో ముఖ్యమంత్రి కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం
నేడు అంతారం, బెల్కటూర్ రైతు వేదికలో ముఖ్యమంత్రి కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం
-వివరాలు వెల్లడించిన వ్యవసాయ శాఖ ఏడి కొమురయ్య
తాండూరు మార్చ్ 23 ( స్పీడ్ న్యూస్ ):- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ పై ప్రత్యక్ష ప్రసారం ఆదివారం సాయంత్రం 3 గంటలకు మండలంలోని అంతారం, బెల్కటూరు రైతు వేదిక భవనాలలో తిలకించేందుకు ఏర్పాట్లు చేసినట్లుగా వ్యవసాయ శాఖ ఏడి కొమురయ్య ఓ ప్రకటన లో తెలిపారు. అలగే ఈ సందర్భంగా ఈ వేదికలు కూడాప్రారంభమవుతుందని ఏడి కొమరయ్య వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు ఆదివారం సాయంత్రం 3 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ జిల్లాలోని నర్మెట్ట సమీపంలో ఆయిల్ పామ్ (ఫ్యాక్టరీ) కంపెనీ ప్రారంభం చేనున్నట్లు చెప్పారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు.అలాగే ప్రస్తుత యాసంగి 2025 కి సంబంధించిన రైతు భరోసా నిధులను కూడ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని మండలము లోని ప్రజా ప్రతినిధులు రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.