ప్రజల ఆశలకు విరుద్ధంగా తాండూర్ మున్సిపల్ బడ్జెట్ – బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్
ఈర్షద్ విమర్శలు
6 గ్యారంటీలు, ఇంద్రమ్మ ఇళ్లకు బడ్జెట్లో చోటులేదా?
రూ.38.50 లక్షల డీపీఆర్ ఖర్చు పై పారదర్శకత లేదు
70 వేల జనాభా ఉన్న పట్టణానికి కేవలం రూ.1 కోటి ఎమ్మెల్యే ఫండ్?
అభివృద్ధి మాటల్లోనేనా? చేతల్లో లేదు..బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఈర్షద్

తాండూర్ మున్సిపల్ బడ్జెట్ పై బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఈర్షద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం తాండూర్ మున్సిపాలిటీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రజల ఆశలను నెరవేర్చే విధంగా లేకపోవడం పట్ల ఆయన నిరాశ వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం కోసం రూపొందించాల్సిన బడ్జెట్లో కీలక పథకాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలు, అలాగే పేదల కోసం ఎంతో కీలకమైన ఇంద్రమ్మఇళ్లపథకంబడ్జెట్లోఎక్కడాకనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు.అలాగే డీపీఆర్ కోసం ఖర్చు చేసిన రూ 38.50 లక్షలపై సరైన వివరాలు వెల్లడించకపోవడం పారదర్శకత పై అనుమానాలు కలిగిస్తోందని విమర్శించారు. మేప్మా విభాగానికి కేటాయించిన నిధుల వినియోగంపై కూడా స్పష్టత లేదు అని అన్నారు.దాదాపు 70 వేల జనాభా ఉన్న తాండూర్ పట్టణానికి ఎమ్మెల్యే ఫండ్ కేవలం రూ.1 కోటి మాత్రమే కేటాయించడం చాలా తక్కువ అని పేర్కొన్నారు. ఈ స్థాయి పట్టణానికి కనీసం రూ.20 నుంచి రూ 30 కోట్ల వరకు నిధులు అవసరం ఉన్నప్పటికీ, ఇంత తక్కువ కేటాయింపు చేయడం విచారకరమన్నారు.అదేవిధంగా ఎంపీ ఫండ్ కేవలం రూ 50 లక్షలు మాత్రమే ఇవ్వడం ప్రజల ఆకాంక్షలకు విరుద్ధమని తెలిపారు. ప్రజలు మంచి మెజార్టీ ఇచ్చినా, అభివృద్ధి విషయంలో సరైన స్పందన కనిపించడం లేదని విమర్శించారు.
ఇంకా ఎమ్మెల్సీ కూడా పెద్ద ఎత్తున హామీలు ఇస్తున్నప్పటికీ, తాండూర్ అభివృద్ధికి గణనీయమైన నిధులు కేటాయించకపోవడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు.తాండూర్ ప్రజల అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళిక, పారదర్శకత, మరియు తగిన నిధుల కేటాయింపు అత్యవసరమని స్పష్టం చేశారు. ప్రస్తుత బడ్జెట్ ప్రజల అవసరాలకు అనుగుణంగా లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రజల ఆశలకు విరుద్ధంగా తాండూర్ మున్సిపల్ బడ్జెట్ – బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఈర్షద్