టాక్స్ కట్టకపోతే ఇదే పరిస్థితి… తాండూరులో మున్సిపాలిటీ వినూత్న చర్యలు!

పెట్రోల్ బంక్‌ పై మున్సిపాలిటీ దండయాత్ర… చెత్త వాహనాలతో ముట్టడి!
చెత్త వాహనాలతో నిరసన!
5 ఏళ్లుగా టాక్స్ ఎగ్గొట్టిన పెట్రోల్ పంప్… అధికారుల స్ట్రాంగ్ యాక్షన్!

టాక్స్ ఎగ్గొట్టేవారికి హెచ్చరిక… ఇళ్ల ముందు కూడా ఇదే ట్రీట్‌మెంట్!

 తాండూర్ మున్సిపల్ అధికారుల హెచ్చరికలు 

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మున్సిపల్ అధికారులు వినూత్నంగా టాక్స్ వసూళ్లకు శ్రీకారం చుట్టారు.గత 5 సంవత్సరాలుగా మున్సిపాలిటీకి చెల్లించాల్సిన సుమారు ₹82 వేల టాక్స్‌ను ఒక పెట్రోల్ పంపు నిర్వాహకులు చెల్లించకపోవడంతో,అధికారులు కఠిన చర్యలకు దిగారు.పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో, ఈసారి మున్సిపల్ అధికారులు కొత్త విధానాన్ని ఎంచుకున్నారు.పెట్రోల్ బంక్ చుట్టూ మున్సిపల్ చెత్త వాహనాలను అడ్డంగా నిలిపి నిరసన వ్యక్తం చేశారు.

ఈ చర్య స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ—గత 5 సంవత్సరాలుగా నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో ఈ విధంగా నిరసన చేపట్టాల్సి వచ్చింది. ప్రజా ధనం వసూలు చేయడం మా బాధ్యత” అని తెలిపారు.
అలాగే, టాక్స్ చెల్లించకుండా తప్పించుకునే ఇతర భవన యజమానులపై కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

భవిష్యత్తులో టాక్స్ ఎగ్గొట్టే వారి ఇళ్ల ముందు కూడా చెత్త వాహనాలతో నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఈ ఘటనతో తాండూరు పట్టణంలో టాక్స్ ఎగ్గొట్టే వారిలో భయం నెలకొంది.మున్సిపల్ అధికారులు తీసుకున్న ఈ వినూత్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

🗓 30 Mar 2026 | 01:56 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top