శ్రీరామ నవమి జాతర హుండీ లెక్కింపు..
ఆదాయం రికార్డు స్థాయిలో!
రూ.11 లక్షలకు పైగా ఆదాయం
ఉత్సవాల విజయానికి సహకరించిన వారందరికీ ఆలయ నిర్వాహకుల కృతజ్ఞతలు
ఘనంగా ముగిసిన జాతర వేడుకలు

శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా యాలాల మండలం జుంటిపల్లిలోని ప్రసిద్ధ శ్రీ సీతారామ చంద్ర స్వామీ దేవాలయంలో భకక్తుల సందడి నెలకొంది. ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఆలయ హుండీని అధికారులు లెక్కించారు.ఈ సందర్భంగా ఆలయ మేనేజర్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ సంవత్సరం జాతర విజయవంతంగా నిర్వహించబడిందని తెలిపారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉత్సవాలు సజావుగా సాగేందుకు సహకరించిన పోలీసు శాఖ, హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది, అలాగే భక్తులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యంగా ఈ ఏడాది జాతరలో భక్తుల స్పందన విశేషంగా ఉండటంతో ఆలయానికి వచ్చిన ఆదాయం కూడా గణనీయంగా పెరిగిందన్నారు.
టెంకాయల వేలం, పులిహోర ప్రసాదాల, మరియు టికెట్ల,హుండీ ద్వారా మొత్తంరూ. 11,18,246 రూపాయల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్, పూజారి వాది పంతులు, రఘు దేశముఖ్, అరవింద్ కుమార్ రెడ్డి, అక్కంపల్లి సర్పంచ్ రాములు, గ్రామస్థులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
శ్రీరామ నవమి జాతర హుండీ లెక్కింపు.. ఆదాయం రికార్డు స్థాయిలో! రూ.11 లక్షలకు పైగా ఆదాయం