అపర భగీరథుడు
– కౌన్సిలర్ లంక లక్ష్మీకాంత్ రెడ్డికి ప్రశంసలు
– వికారాబాద్ 22వ వార్డులో నాల్గో బోరు బావి విజయవంతం
– వార్డులో తాగునీటి కోసం నిరంతర కృషికి ఫలితం
వికారాబాద్ పట్టణంలోని 22వ వార్డులో ప్రజలకు తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు వార్డు కౌన్సిలర్ లంక లక్ష్మీకాంత్ రెడ్డి చేపట్టిన చర్యలు ఫలితాన్నిస్తున్నాయి. ఇప్పటికే మూడు బోర్లు వేయించి ప్రజలకు తాగునీటి సౌకర్యాన్ని అందించిన ఆయన, తాజాగా నాలుగో బోర్ కూడా వేయించి విజయవంతంగా నీరు పొంగిపొర్లేలా చేశారు.
నాలుగో బోర్లో కూడా పుష్కలంగా నీరు రావడంతో వార్డు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ, ప్రజల అవసరాలను గుర్తించి వేగంగా పనులు పూర్తి చేయడం లంక లక్ష్మీకాంత్ రెడ్డి నాయకత్వానికి నిదర్శనమని వార్డు ప్రజలు పేర్కొన్నారు.తాగునీటి కోసం నిరంతరం కృషి చేసి నాలుగు బోర్లు విజయవంతంగా పూర్తి చేయడం వల్ల ఆయనను “22వ వార్డు అపర భగీరథుడు”గా కొనియాడుతున్నారు. ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఆయనకు వార్డు ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
కౌన్సిలర్ లంక లక్ష్మీకాంత్ రెడ్డికి ప్రశంసలు
అపర భగీరథుడు
- కౌన్సిలర్ లంక లక్ష్మీకాంత్ రెడ్డికి ప్రశంసలు
- వికారాబాద్ 22వ వార్డులో నాల్గో బోరు బావి విజయవంతం
- వార్డులో తాగునీటి కోసం నిరంతర కృషికి ఫలితంవికారాబాద్ పట్టణంలోని 22వ వార్డులో ప్రజలకు తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు వార్డు కౌన్సిలర్ లంక లక్ష్మీకాంత్ రెడ్డి చేపట్టిన చర్యలు ఫలితాన్నిస్తున్నాయి. ఇప్పటికే మూడు బోర్లు వేయించి ప్రజలకు తాగునీటి సౌకర్యాన్ని అందించిన ఆయన, తాజాగా నాలుగో బోర్ కూడా వేయించి విజయవంతంగా నీరు పొంగిపొర్లేలా చేశారు.