అంత్యక్రియలకు బీవీజీ ఫౌండేషన్ ఆర్థిక సహాయం

సర్పంచ్ సహకారంతో అంత్యక్రియలు నిర్వహణ

గ్రామస్తుల ఐక్యతకు నిలువెత్తు నిదర్శనం

యాలాల మండలంలోని బండమదిపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రేగొండి నర్సిములు (50) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.ఈ విషయం తెలుసుకున్న తాండూరు పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ సంపత్ కుమార్ మానవత్వం చాటుతూ బీవీజీ ఫౌండేషన్ ద్వారా మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. ఈ సాయం నర్సిములు భార్య దేవమ్మకు అందించబడింది.
ఇక గ్రామ సర్పంచ్ బెస్త నరేష్ కూడా తన వంతు సహాయం అందిస్తూ కొంత నగదును జోడించి అంత్యక్రియల నిర్వహణకు తోడ్పాటునందించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు సానుభూతి వ్యక్తం చేస్తూ కుటుంబానికి అండగా నిలిచారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాములు, గ్రామస్తులు బాయికాడి బసన్న, పి. చంద్రప్ప, చెట్టుకింది అంజయ్య, సండ్రస హన్మప్ప, దత్తు లక్ష్మణ్, శ్యామప్ప, లక్ష్మయ్య, పకిరప్ప తదితరులు పాల్గొన్నారు.
గ్రామంలో ఈ ఘటన మానవత్వం, సహానుభూతి ఇంకా జీవించి ఉన్నాయని మరోసారి రుజువు చేసింది.

🗓 17 Apr 2026 | 04:42 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top