పెట్రోల్ కొరతతో తెలంగాణలో కలకలం – వికారాబాద్ జిల్లాలో తీవ్ర ప్రభావం
ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణలోనూ పెట్రోల్ కొరత భయం
వికారాబాద్ జిల్లాలో “నో స్టాక్” బోర్డులతో బంకులు మూసివేత
తాండూర్, పరిగి, కొడంగల్ ప్రాంతాల్లో వాహనదారుల ఆందోళన
క్యూ లైన్లు పాటించకపోవడంతో బంక్ యజమానుల ఆగ్రహం
తాండూరులో ఒక ట్యాంకర్ రావడంతో తాత్కాలిక ఉపశమనం
వెంటనే సరఫరా పెంచాలని ప్రజల డిమాండ్

ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన పెట్రోల్ కొరత ప్రభావం ఇప్పుడు తెలంగాణలోని పలు జిల్లాలకు విస్తరించింది. ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో పరిస్థితి తీవ్రంగా మారింది. జిల్లా వ్యాప్తంగా అనేక పెట్రోల్ బంక్‌ల వద్ద “నో స్టాక్” బోర్డులు కనిపించడం వాహనదారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.తాండూర్, పరిగి, కొడంగల్ మరియు వికారాబాద్ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు ఉదయం నుంచే బంక్‌ల వద్ద బారులు తీరుతున్నారు.
వికారాబాద్ పట్టణ కేంద్రంలో ఉదయం 5 గంటల నుంచే భారీగా వాహనాలు క్యూ లైన్లలో నిలిచాయి. అయితే కొంతమంది క్యూ లైన్ పాటించకపోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ నేపథ్యంలో పెట్రోల్ నిల్వలు ఉన్నప్పటికీ, బంక్ యజమానులు తాత్కాలికంగా బంకులను మూసివేయడం గమనార్హం. ఇది ప్రజల్లో ఆగ్రహాన్ని రగిలించింది. “నో స్టాక్” బోర్డులు పెట్టి ఇబ్బంది పెట్టడం సరికాదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక తాండూర్ పట్టణంలో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. రోజంతా పెట్రోల్ దొరకక వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అయితే సాయంత్రం సమయంలో ఫయాజ్ పెట్రోల్ బంక్ వద్ద ఒక ట్యాంకర్ చేరుకోవడంతో కొంత ఉపశమనం లభించింది. పెట్రోల్ అందుబాటులో ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బంక్ యజమాని తెలిపారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు ప్రభుత్వం, సంబంధిత అధికారులను వెంటనే స్పందించాలని కోరుతున్నారు. పెట్రోల్, డీజిల్ సరఫరాను సమృద్ధిగా అందించి, ప్రజల ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.